గూగుల్ లో నెటిజన్లు ఎక్కువగా వేటికోసం వెతికారో తెలుసా?!

By Sandra Ashok Kumar  |  First Published May 20, 2020, 11:12 AM IST

ఇది కరోనా ‘లాక్ డౌన్’ కాలం. ఈ సమయంలో వర్చువల్ హగింగ్, హౌ టు స్టే కనెక్ట్, మెడికేషన్, వర్చువల్ బర్త్ డే గ్రీటింగ్స్ అనే పదాల కోసం గత వారం రోజులుగా నెటిజన్లు సెర్చింజన్ గూగుల్ లో అన్వేషించారు. 
 


న్యూయార్క్‌: ఇది కరోనా ‘లాక్ డౌన్’ టైం..  అత్యంత క్లిష్ట సమయం.. లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలంతా ఎక్కడివారు అక్కడే లాక్‌ అయిపోయారు. దీంతో కుటుంబ సభ్యుల ప్రేమకే కాదు బంధు మిత్రుల అభిమానానికి సైతం దూరం అయ్యారు.

ఈ నేపథ్యంలో తమకు ఇష్టమైన వారిని భౌతికంగా కలిసి పలకరించే అవకాశం లేకపోయినా వర్చువల్‌గా కలవడానికి గల అవకాశాలపై ఎక్కువ మంది ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌లో అన్వేషణ జరిపారు. వారం రోజుల్లో అత్యధికంగా వెతికిన పదాలను గూగుల్‌ విడుదల చేసింది.‘హౌ టు కీప్ యువర్ రూం క్లీన్’ అనే అంశాన్ని నాలుగు రెట్ల సార్లకు పైగా వెతికారు.

Latest Videos

ఇందులో ముఖ్యంగా  ‘హౌ టు స్టే కనెక్ట్’  అనే అంశం కోసం అత్యధిక శాతం మంది వెతికినట్టు గూగుల్‌ వెల్లడించింది. లాక్‌డౌన్‌ ప్రారంభంలో ఇంటి పనులు, ఫిట్‌నెస్‌ కోసం అన్వేషించిన ప్రజానీకం.. తాజాగా తమ మిత్రులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్‌ కావడానికి ఉన్న మార్గాలపై అన్వేషించడం గణనీయమైన మార్పును సూచిస్తోందని గూగుల్‌ పేర్కొంది.

also read   సత్య నాదెళ్ల సంచలనం: పర్మినెంట్ ‘వర్క్ ఫ్రం హోం’తో మెంటల్ హెల్త్ గాయబ్..

వర్చువల్‌ గెట్‌ టుగెదర్స్‌, వర్చువల్‌ లవ్‌, వర్చువల్‌ డ్యాన్స్‌ పార్టీ తదితర అంశాల కోసం ఎక్కువగా వెతికారని గూగుల్ వెల్లడించింది. అలాగే, వర్చువల్‌ హగ్‌, వర్చువల్‌ ఫ్లవర్స్‌, క్వారంటైన్‌ బర్త్‌డే విషెస్‌ పదాలు కూడా టాప్‌ సెర్చ్‌ ట్రెండ్స్‌లో ఉన్నట్టు తెలిపింది.

ప్రజలు వర్చువల్‌గా అనుసంధానం కావడానికి అనుగుణంగా టెక్‌ దిగ్గజ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ గ్రూప్‌ చాట్‌లు, వీడియో కాలింగ్‌ ప్లాట్‌ఫాంలను మరింత మెరుగుపరిచాయి. గూగుల్‌ మీట్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ రూమ్‌లు వంటి వాటిని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 

వర్చువల్‌ హగ్‌ అనే అంశం కోసం ఫిలిఫ్పీన్స్‌‌ ప్రజలు అత్యధికంగా అన్వేషించగా ఆస్ట్రేలియా ప్రజలు వర్చువల్‌ ఫ్లవర్స్ అనే పదం కోసం వెతికారు. క్వారంటైన్‌ బర్త్‌డే విషెస్‌ అనే అంశం కోసం భారతీయులు అత్యధికంగా అన్వేషణ జరిపారు. ప్రజలు తమ సన్నిహితులకు శుభాకాంక్షలు చెప్పడానికి, వారి పట్ల తమ ప్రేమ, ఆప్యాయతలను వ్యక్తంచేయడానికి ఏయే మార్గాలు ఉన్నాయో తెలుసుకొనేందుకు గూగుల్‌లో వెతకడం విశేషం.

గ్రూప్ కాల్, గ్రూప్ ఫోన్, గ్రూప్ వాచ్ అనే పదాల కోసం కూడా నెటిజన్లు భారీగా వెతికారు. రిలాక్సేషన్ పదాల కోసం కూడా నెటిజన్లు అన్వేషణ జరిపారు. ‘రిలాక్స్ చిల్ హౌస్ మ్యూజిక్’, ‘మెడిటేషన్’, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్’, ‘హౌ టూ ఆర్గనైజ్’ అనే పదాల గురించి బాగా సెర్చ్ చేశారు.
 

click me!