కరోనా వైరస్ వల్ల పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకున్న రంగాల్లో పౌర విమానయాన రంగం ఒకటి. మార్చి 25 నుంచి కార్యకలాపాలు లేకపోవడంతో తమ వద్ద నిధుల్లేవని, వేతనాలివ్వలేమని బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ తేల్చేసింది. వేతనాలివ్వడానికి, కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రభుత్వం, బ్యాంకులు సాయం చేయాలని కోరింది.
న్యూఢిల్లీ: ఉద్యోగులకు వేతనాలు అందించే పరిస్థితి లేదని ప్రైవేట్ విమానయాన సంస్థ ‘గో ఎయిర్’ తేల్చేసింది. కరోనా కల్పించిన సంక్షోభం నుంచి బయట పడేందుకు తమకు మద్దతు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
కరోనా ‘లాక్ డౌన్’ ముగియగానే కార్యకలాపాలను పున: ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నట్లు వాడియా గ్రూప్ చైర్మన్ నుస్లీ వాడియా, గో ఎయిర్ ఎండీ జే వాడియా తెలిపారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల విమానయాన సంస్థలు కార్యకలపాలను పునరుద్ధరించడానికి, సిబ్బంది వేతనాలను చెల్లించడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు, బ్యాంకులు ఆర్థిక సాయం చేస్తున్నాయన్నారు.
undefined
మనదేశంలోనూ అటువంటి సాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పలు సార్లు అభ్యర్థించామని నుస్లీవాడియా, జే వాడియా పేర్కొన్నారు. కానీ బ్యాంకుల నుంచి ఇప్పటికీ స్పష్టమైన సంకేతాలు రావడం లేదన్నారు.
మార్చి 25 నుంచి సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయినా, బ్యాంకుల నుంచి సాయం అందకున్నా తాము 2500 మంది సిబ్బందికి పూర్తి వేతనాలు చెల్లించామని నుస్లీ వాడియా, జే వాడియా తెలిపారు. మిగతా వారికి విడుతల వారీగా, వాయిదాల వారీగా చెల్లిస్తున్నామన్నారు. కొందరిని వేతనం లేని సెలవుపై పంపినట్లు గో ఎయిర్ తెలిపింది.
also read ఆగస్టు వరకు నో ప్రాబ్లం: ఈఎంఐ చెల్లింపులపై మరో 3 నెలల మారటోరియం?
మరో వైపు తమ ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ వేతనాలను చెల్లించాల్సిన గో ఎయిర్ స్పష్టం చేసింది. ఏప్రిల్‌లో ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించిన ఎయిర్‌లైన్ మరికొందరు ఉద్యోగులను సెలవుపై పంపింది.
బ్యాంకింగ్ వ్యవస్థ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఊరట లభించకపోవడంతో సిబ్బందికి తక్షణమే వేతనాలు చెల్లించేందుకు నిధులు లేవని నుస్లీ వాడియా, జే వాడియా ఉద్యోగులకు సంయుక్తంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎయిర్‌లైన్ కార్యకలాపాలు నిలిచిపోయినందున సంస్థ వద్ద నగదు నిల్వలు లేవని వెల్లడించారు.
తమకు మారో మార్గం లేకున్నా మార్చి, ఏప్రిల్ నెల వేతనం చెల్లించాల్సి ఉందని నుస్లీ వాడియా, జే వాడియా అన్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో విమానయాన సర్వీసులు నిలిచిపోవడంతో అన్ని విమానయాన రంగం తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నదని వివరించారు.
మొత్తం ఉద్యోగుల్లో 40 శాతం మందికి పూర్తి వేతనాలు చెల్లించిన గో ఎయిర్ మిగిలిన ఉద్యోగులకు దశలవారీగా, వాయిదాల పద్ధతిలో చెల్లింపులు చేపడతామని పేర్కొంది. ఇక లాక్‌డౌన్ ఫలితంగానే పరిమిత వనరుల పరిస్థితి నెలకొందని, తమ చేతిలో లేని పరిస్థితులతోనే ఉద్యోగులకు ఇబ్బందులు నెలకొన్నాయని లేఖలో సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
గో ఎయిర్ బోర్డు సభ్యులు, సీఎండీ సైతం వేతనాలు తీసుకోవడం లేదని లేఖ పేర్కొంది. ఇక అమెరికా, దక్షిణాసియా, మధ్యప్రాచ్య, యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు, బ్యాంకింగ్ వ్యవస్థ అక్కడి విమానయాన సంస్థలు ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేలా ఆదుకున్నాయని వివరించింది. ఉద్యోగుల పరిస్థితిని మెరుగుపరిచి, ఎయిర్‌లైన్ మనుగడ కోసం తాము కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని గో ఎయిర్ ఆ లేఖలో వెల్లడించింది.