ఆ రెండు ఘటనలే కరోనాను ఎదుర్కోవడానికి ప్రతిబంధకాలు: రాష్ట్రపతి కోవింద్

By narsimha lode  |  First Published Apr 3, 2020, 6:19 PM IST


: ఆనంద్ విహార్ లో వలస కార్మికులు, నిజాముద్దీన్ మర్కజ్ ఘటనలు కరోనా వైరస్ ఎదుర్కోవడంలో చేసిన ప్రయత్నాలను ఎదురుదెబ్బ తీశాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. 



న్యూఢిల్లీ: ఆనంద్ విహార్ లో వలస కార్మికులు, నిజాముద్దీన్ మర్కజ్ ఘటనలు కరోనా వైరస్ ఎదుర్కోవడంలో చేసిన ప్రయత్నాలను ఎదురుదెబ్బ తీశాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. 

కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శుక్రవారం నాడు రాష్ట్రాల గవర్నర్లతో ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరూ కూడ ఆకలితో బాధపడకూదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు.  

Latest Videos

ప్రజలకు  సౌకర్యాలను కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాలకు సూచించారు. కరోనా వైరస్ రోగులకు వైద్యం చేస్తున్న వైద్య సిబ్బందిపై దాడులు చేయడంపై ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. 

Also read:దేశంలో 2301కి చేరిన కరోనా కేసులు, 56 మంది మృతి: వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు

కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో ఆదర్శమైన ధైర్యం, క్రమశిక్షణ,సంఘీభావం చూపిన ప్రజలను ఆయన అభినందించారు. అందరికీ అవసరమైన ఆహారం, నిత్యావసర సరుకులు  అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే సామాజిక దూరాన్ని పాటించాల్సిందేనని ఆయన ప్రజలను కోరారు. 

దేశంలో శుక్రవారం నాటికి 2301 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 56 మంది మృతి చెందారు. రెండు రోజులుగా 647 కేసులు ఢిల్లీ మర్కజ్ లో ఉన్నవారికి సోకినట్టుగా కేంద్రం ప్రకటించింది.


 

click me!