కరోనా ఎఫెక్ట్: సర్వీసులను నిలిపివేసిన ఫ్లిఫ్‌కార్ట్

By narsimha lodeFirst Published Mar 25, 2020, 2:53 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిఫ్ కార్ట్ తన సర్వీసులను నిలిపివేస్తున్నట్టుగా బుధవారం నాడు ప్రకటించింది

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిఫ్ కార్ట్ తన సర్వీసులను నిలిపివేస్తున్నట్టుగా బుధవారం నాడు ప్రకటించింది. ఈ నెల 25 వ తేదీ నుండి తన అన్ని రకాల సర్వీసులను నిలిపివేస్తున్నట్టుగా ఫ్లిఫ్‌కార్ట్  తేల్చి చెప్పింది.

వినియోగదారుల అవసరాలను తీర్చడమే తమ ప్రథమ కర్తవ్యమని ఫ్లిఫ్ కార్ట్ ప్రకటించింది. అయితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కు మోడీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు  లాక్ డౌన్ ను విధించింది.దీంతో తన సర్వీసులను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది ఫ్లిఫ్‌కార్ట్.

లాక్‌డౌన్ సమయంలో తమ డెలీవరీ ఎగ్జిక్యూటివ్స్ భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం మనమంతా కష్టకాలంలో ఉన్నాం. అందరూ సురక్షితంగా ఉందాం, దీని ద్వారా జాతికి సహాయం చేద్దామని ఆ సంస్థ ప్రకటించింది. 

click me!