న్యూఢిల్లీ లేడి హర్డింగ్ ఆసుపత్రిలో పనిచేసే 8 మందికి కరోనా

By narsimha lode  |  First Published Apr 19, 2020, 12:35 PM IST

న్యూఢిల్లీలోని లేడి హర్డింగ్ ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు నర్సులకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని లేడి హర్డింగ్ ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు నర్సులకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ సోకిన ఎనిమిది మంది వైద్య సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు అధికారులు.కరోనా వైరస్ వీరికి ఎలా సోకిందనే విషయాన్ని అధికారులు విచారణ చేపట్టారు.

Latest Videos

ఆసుపత్రిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించే విషయమై ఆసుపత్రి వర్గాలు సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. న్యూఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో వారిని క్వారంటైన్ కు తరలించారు. 

ఈ ఆసుపత్రితో పాటు సర్ గంగారామ్ ఆసుపత్రిలో కూడ ఇదే రకమైన వాతావరణం కన్పించడంతో వారిని కూడ క్వారంటైన్ కు తరలించారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు 1800కి చేరుకొన్నాయి. ఈ వైరస్ సోకి ఇప్పటికే డిల్లీలో 42 మంది మృతి చెందారు.

ఈ ఆసుపత్రిలో పనిచేసే పీడియాట్రిక్ ఐసీయూలో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకింది. దీంతో అతనితో సన్నిహితంగా ఉన్న డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందిని పరీక్షిస్తే  కరోనా వైరస్ సోకిందని తేలింది.

also read:దేశంలో ఆగని కరోనా విజృంభణ: 15 వేలు దాటిన కేసులు, 500 దాటిన మరణాలు

ఢిల్లీలోని 60 మంది హెల్త్ వర్కర్స్ కరోనా వైరస్ బారినపడినట్టుగా అధికారులు ప్రకటించారు.లోక్‌నాయక్ ఆసుపత్రిలో పనిచేసే ఒక్క డాక్టర్ తో పాటు ఇద్దరు నర్సులు కరోనా బారిన పడ్డారు.

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లకు కరోనా సోకింది. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లకు కరోనా సోకింది. ఈ కుటుంబానికి చెందిన బంధువులు విదేశాల నుండి రావడంతో ఈ వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు.

నార్త్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ క్లినిక్ నిర్వహించే డాక్టర్ దంపతులకు కరోనా సోకింది.కళావతి శరణ్ పిల్లల ఆసుపత్రిలో ఒక్క డాక్టర్ తో పాటు ముగ్గురు నర్సులకు కరోనా సోకింది.


 

click me!