కరోనా ఎఫెక్ట్: ఫ్రీ ఇంటర్నెట్ డాటా, ఆన్ లిమిటెడ్ కాల్స్ ఇవ్వాలంటూ సుప్రీంలో పిటిషన్...

By Sandra Ashok Kumar  |  First Published Apr 17, 2020, 4:43 PM IST

దేశంలో లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, దీనిని తగ్గించేందుకు ప్రజలందరికీ ఉచిత అపరిమిత కాల్స్, డేటా సౌకర్యంతోపాటు డీటీహెచ్ సేవలు అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.


ప్రపంచంతో పాటు భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాచింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో లాక్ కూడా కూడా అమలు పరిచారు. మొదటి దశలో  మార్చ్ మూడో వారం నుండి ఏప్రిల్ 14 వరకు లోక్ డౌన్ అమలు పర్చగా ప్రస్తుతం రెండో దశ లాక్ డౌన్ అమలులోకి వచ్చింది.

కరోనా సొకాకుండా ముందస్తు జాగ్రతగా  సామాజిక దూరం  పాటించాలని అలాగే ముఖానికి ఫేస్ మస్కూలు ధరించాలని ప్రభుత్వం కోరింది. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ల నుండి బయటికి వెళ్లలేని పరిస్థితి, ఇంకా నిత్యవసరాల సరుకులు, మందులు  కొనడానికి తప్ప ఇతర కారణాలకు కూడా బయటికి వెళ్లడానికి విలులేకుండా అక్షలు విధించారు.

Latest Videos

ప్రజలు ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితి దీంతో టెలికాం  నేట్వర్కులు  ఆధిక డాటా ఆఫర్లను ప్రకటించాయి. మరికొన్ని ప్రదేశాలలో ఇంటి వద్దకే నిత్యవసర సరుకులు సప్లయి చేస్తున్నారు.

also read  టిసిఎస్ కు తగ్గినా లాభం...స్టాక్ మార్కెట్లో పడిపోయిన షేర్లు...

దేశంలో లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, దీనిని తగ్గించేందుకు ప్రజలందరికీ ఉచిత అపరిమిత కాల్స్, డేటా సౌకర్యంతోపాటు డీటీహెచ్ సేవలు అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ మేరకు మనోహర్ ప్రతాప్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఉంటున్న వారు, అలాగే హాస్పిటల్ లో క్వారంటైన్‌లో ఉంటున్న వారు మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖను కూడా ఆదేశించాలని పిటిషన్‌దారు పేర్కొంటూ కోరారు.

రెండో దశ లాక్‌డౌన్ అమల్లో భాగంగా మే 3వ తేదీ వరకు అన్ని చానళ్లను అపరమితంగా వీక్షించే సదుపాయం కల్పించేలా చూడాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం, టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్)లను ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు.

లాక్‌డౌన్ సమయంలో వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు అనుగుణంగా చట్ట నిబంధనల ప్రకారం అధికారాలను వినియోగించుకునేలా సూచించాలని పిటిషన్‌దారు కోరారు.అమేరిక వంటి దేశాలలో లాక్ డౌన్ కారణాంగ ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆన్ లైన్ స్త్రీమింగ్ యాప్స్ ఉచిత ఆకెస్స్ అందించిన విష్యం అందరికీ తెలిసిందే.
 

click me!