కాటేస్తున్న కరోనా: డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ గవర్నర్ సందేశం

Siva Kodati |  
Published : Mar 31, 2020, 02:45 PM ISTUpdated : Mar 31, 2020, 03:34 PM IST
కాటేస్తున్న కరోనా: డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ గవర్నర్ సందేశం

సారాంశం

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్న డిజిటల్ బ్యాంకింగ్ గురించి 30 సెకన్ల వీడియోలో ప్రసంగించారు. కరోనా మహమ్మారి జీవితాలను, వ్యాపారాలను ఒకే విధంగా పరీక్షిస్తోందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారతదేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మనదేశంలో లాక్‌డౌన్‌కు ముందు నుంచే అన్ని రంగాలపై ప్రభావం పడింది. ప్రపంచంలోని అన్ని స్టాక్ మార్కెట్లతో  పాటు భారత్‌లోనూ ఇదే పరిస్ధితి కొనసాగుతూ ఉంది.

ఈ క్రమంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్న డిజిటల్ బ్యాంకింగ్ గురించి 30 సెకన్ల వీడియోలో ప్రసంగించారు. కరోనా మహమ్మారి జీవితాలను, వ్యాపారాలను ఒకే విధంగా పరీక్షిస్తోందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

Also Read:కరోనా లాక్ డౌన్.. నడి రోడ్డుపై వలస కార్మికుడి దీనస్థితి.. ఫోటో వైరల్

ప్రస్తుతం సంక్షోభ సమయంలో బ్యాంకింగ్ అత్యంత ప్రభావితమైన రంగాలలో ఒకటిగా ఉంది. ఇది సామాన్యులను విపరీతమైన ఆందోళనకు గురిచేసిందన్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన తర్వాత ఈ ఇబ్బంది మరింత ఎక్కువైందని శక్తికాంత్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

కరెన్సీ నోట్లతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో సాధ్యమైనంత వరకు డిజిటల్ చెల్లింపులనే చేయాలని ఆయన సూచించారు. క్రెడిట్, డెబిట్ కార్డ్స్, డిజిటల్ వ్యాలెట్స్, యూపీఏ పేమెంట్స్ వంటి క్యాష్‌లెష్ ట్రాన్సాక్షన్స్ చేయాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

Also Read:కేరళలో కరోనాను జయించిన వృద్ద దంపతులు

కరోనా కట్టడికి 21 రోజుల లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ డిజిటల్ బ్యాంకింగ్ సాయంతో చెల్లింపులు చేయాలని శక్తికాంత్ దాస్ సలహా ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మనందరం చాలా కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో, మనం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

"

PREV
click me!

Recommended Stories

భారత్‌లోకి ఎంటరైన కరోనా కొత్త వేరియంట్.. మహారాష్ట్రలో వెలుగులోకి , లక్షణాలివే
భారత్ లో కోవిడ్ విజృంభణ.. ఒకే రోజు 2,151 కొత్త కేసులు.. ఐదు నెలల్లో అత్యధికం