మోడీ పిలుపుకు అపూర్వ స్పందన: దేశమంతా దీపాల కాంతులు

By Siva KodatiFirst Published Apr 5, 2020, 9:46 PM IST
Highlights

కరోనా వైరస్‌పై పోరు నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ దేశం ఒక్కటైంది. జాతి సమైక్యతను చాటుతూ సరిగ్గా రాత్రి 9 గంటల నుంచి 9.09 నిమిషాల వరకు దేశ ప్రజలు ఇళ్లలో లైట్లు ఆపేసి కొవ్వొత్తులు, దీపాలు, టార్చి లైట్లు వెలిగించారు. 

గో కరోనా.. గో కరోనా అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు సైతం పాల్గొన్నారు.

ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు, ప్రధాని నరేంద్రమోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, త్రివేంద్ర సింగ్ రావత్, హర్షవర్థన్‌‌తో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు తమ నివాసాల వద్ద జ్యోతులను వెలిగించారు. 

click me!