కరోనా అనుమానం: భయంతో సొంత తమ్ముడిని చంపిన అన్న

By Sree sFirst Published Mar 27, 2020, 10:29 AM IST
Highlights

ఈ కరోనా వైరస్ పట్ల కొందరికి సరైన అవగాహన లేకపోవటం వల్ల వారు అతిగా భయపడటమే కాదు, అవి హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఒక సంఘటనే ముంబైలో జరిగింది

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచం వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ వైరస్ విలయతాండవానికి భారతదేశం కూడా భారీ మూల్యం చెల్లించుకోకముందే... ముందు జాగ్రత్తగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని మోడీ. 

తొలుత జనతా కర్ఫ్యూ అని ప్రజలను సిద్ధం చేసిన ప్రధాని ఒకేసారి మూడు వారాలపాటు లాక్ డౌన్ ని ప్రకటించారు. ఇలా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చైన్ ని బ్రేక్ చేస్తే వైరస్ ఇక వ్యాపించకుండా చేయొచ్చనేది ప్రభుత్వ ఆలోచన. 

ఇక ఈ కరోనా వైరస్ పట్ల కొందరికి సరైన అవగాహన లేకపోవటం వల్ల వారు అతిగా భయపడటమే కాదు, అవి హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఒక సంఘటనే ముంబైలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే... ముంబైలోని కాండీవాలి ప్రాంతంలో రాజేష్ ఠాకూర్ అనే వ్యక్తి భార్యతో కలిసి నివాసముంటున్నాడు. రాజేష్ తమ్ముడు దుర్గేష్ పుణెలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అతడు పూణే నుండి అన్న వాళ్ళ ఇంటికి ముంబై వచ్చాడు. 

లాక్ డౌన్ ఉంది బయటకు వెళ్లొద్దు అని చెప్పినప్పటికీ దుర్గేష్ బుధవారం రోజు రాత్రి దుర్గేష్ ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. అతడు తిరిగి ఇంటికి వచ్చిన తరువాత ఇలా బయటకు వెళితే... ఇంట్లో తమకు కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉందని అతని అన్న రాజేష్, వదిన ఘర్షణకు దిగారు. 

ఇలా చిన్నగా మొదలైన గొడవ పెద్దగా ముదిరి అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దానితో కోపంలో అన్న రాజేష్ ఠాకూర్ తమ్ముడు దుర్గేష్ ను హత్యా చేసాడు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి రాజేష్ ని అరెస్ట్ చేసారు. 

ఇకపోతే, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 700 దాటింది. కొత్తగా 88 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 722కు చేరుకుంది. వారిలో 47 మంది విదేశీయులు ఉన్నారు. 42మందికి కరోనా వ్యాధి నయం కావడంతో వారిని డిశ్చార్జీ చేశారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య 16కు చేరుకుంది.

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో కేరళ మహారాష్ట్రను దాటేసింది. కేరళలో అత్యధికంగా 137 కేసులు నమోదైంది. మహారాష్ట్ర 125 కేసులతో రెండు స్థానంలో నిలచింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ లెక్కలు ఇలా ఉన్నాయి...

Also Read: కరోనా లాక్ డౌన్: పాలు కొనడానికి వెళ్లిన వ్యక్తి పోలీసుల లాఠీచార్జిలో మృతి

కేరళ 137
మహారాష్ట్ర 125, మరణాలు 3
కర్ణాటక 55, మరణాలు 3
తెలంగాణ 44
గుజరాత్ 43, మరణాలు 3
ఉత్తరప్రదేశ్ 42
రాజస్థాన్ 40
ఢిల్లీ 36, మరణాలు 1
పంజాబ్ 33, మరణాలు 1
హర్యానా 32
తమిళనాడు 29, మరణాలు 1
మధ్యప్రదేశ్ 20, మరణాలు 1
జమ్మూ, కాశ్మీర్ 14, మరణాలు 1
లడక్ 13
ఆంధ్రప్రదేశ్ 11
పశ్చిమ బెంగాల్ 10, మరణాలు 1
బీహార్ 7, మరణాలు 1
చండీగడ్ 7
చత్తీస్ గడ్ 6
ఉత్తరాఖండ్ 6
గోవా 3
హిమాచల్ ప్రదేస్ 3, మరణాలు 1
ఒడిశా 3
అండమాన్ నికోబార్ 1
మణిపూర్ 1
మిజోరం 1
పుదుచ్చేరి 1

ఇదిలావుంటే, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం రాష్ట్రాల గవర్నర్లతో, లెఫ్టినెంట్ గవర్నర్లతో మాట్లాడున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది.

click me!