5జీతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా... స్పష్టం చేసిన ఐరాస..

By Sandra Ashok Kumar  |  First Published Apr 24, 2020, 2:19 PM IST

కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని, అలాగే కొన్ని దేశాలు లాక్ డౌన్ కూడా అమలుపరిచాయి. తాజాగా యూరప్‌ దేశాల్లో 5జీ నెట్‌వర్క కోసం ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ కారణంగా కరోనా వైరస్ (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాపిస్తుందంటూ ఓ పుకారు సోషల్ మీడియా ద్వారా హల్ చల్ చేస్తుంది. ప్రజలు ఈ పుకార్ల వల్ల మరింతగా భయబ్రాంతులకు గురవుతున్నారు.


కరోనా వైరస్ ధాటికి ఆగ్రా దేశాలు సైతం కుప్పకూలయి. దేశ ఆర్ధిక రంగాన్ని, ప్రజలని వేణుకుపుట్టిస్తుంది. కరోనా వైరస్ పై పోరుకు ప్రపంచ దేశాలు ఏకమయ్యాయి. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఎక్కడ పుట్టిందన్న అంశంపై ఎన్ని పుకార్లు ఉన్నాయో, అలాగే  అది దేని ద్వారా వ్యాపిస్తుందన్నదానిపై కూడా అన్నీ పుకార్లు పుట్టకొస్తున్నాయి.

కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని, అలాగే కొన్ని దేశాలు లాక్ డౌన్ కూడా అమలుపరిచాయి. తాజాగా యూరప్‌ దేశాల్లో 5జీ నెట్‌వర్క కోసం ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ కారణంగా కరోనా వైరస్ (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాపిస్తుందంటూ ఓ పుకారు సోషల్ మీడియా ద్వారా హల్ చల్ చేస్తుంది.

Latest Videos

ప్రజలు ఈ పుకార్ల వల్ల మరింతగా భయబ్రాంతులకు గురవుతున్నారు. అసలే ఆ దేశాల్లో వ్యాధి తీవ్రత నష్టం కలిగిస్తుండటంతో జనం కూడా వెంటనే ఈ పుకార్లను నమ్మేశారు. దాంతో బెల్జియం, బ్రిటన్‌, సైప్రస్‌, ఐర్లాండ్‌ తదితర దేశాల్లో 5జీ నెట్‌వర్క్‌ కోసం నిర్మించిన సెల్ టవర్లను ధ్వంసం చేయటం మొదలుపెట్టారు.

అంతే కాదు ఈ  సెల్ టవర్ల నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఇంజినీర్లపై కూడా దాడులకు దిగుతున్నారు. దీంతో పరిస్థితి చేయిదాటేలా ఉండటంతో ఐక్యరాజ్యసమితి ఇన్‌ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంస్థ రంగంలోకి దిగింది.  5జీ నెట్‌వర్క్‌ టవర్లతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ప్రచారం అబద్ధమని స్పష్టంచేసింది.

అలాంటి పుకార్లను, అపోహలను నమ్మవద్దని కోరింది. వీటిద్వారా కరోనా వైరస్‌ వ్యప్తిచెందుతుందనేందుకు ఎలాంటి సాంకేతిక ఆధారాలు లేవని ఇంటర్నేషనల్‌ టెలీకమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) ప్రతినిధి మోనికా గెహనర్‌ తెలిపారు. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని స్పష్టంచేశారు. తప్పుడు సమాచారం, పుకార్లను నమ్మవద్దని తెలిపింది.

click me!