లాక్‌డౌన్‌ సడలింపుతో తగ్గనున్న బంగారం ధరలు...

By Sandra Ashok Kumar  |  First Published May 5, 2020, 12:13 PM IST

అక్షయ తృతీయ రోజున బంగారం ఊరటనిస్తుంది అనుకుంటే నిరాశే ఎదురైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో  బంగారం ధర మంగళవారం దిగువన ట్రేడ్ అవుతోంది. 


ముంబై: లాక్ డౌన్ పరిమితుల సడలింపుతో  బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కరోనా వైరస్ కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల బంగారం అమ్మకాలు భారీగా తగ్గాయి. అక్షయ తృతీయ రోజున బంగారం ఊరటనిస్తుంది అనుకుంటే నిరాశే ఎదురైంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో  బంగారం ధర మంగళవారం దిగువన ట్రేడ్ అవుతోంది.  ప్రారంభంలో రూ .45,527 పలికిన  జూన్ డెలివరీ ఫ్యూచర్స్ 10 గ్రాములకి 0.71 శాతం తగ్గి 45,480 రూపాయలకు చేరుకుంది. అంతకుముందు రూ.45,807 లు పలికిన కిలో వెండి ధర కూడా పడిపోయింది.

Latest Videos

ఫ్యూచర్స్ తో పోలిస్తే 0.24 శాతం తగ్గి  కిలో వెండి ధర రూ .41,143 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్  మార్కెట్లో  22  క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 43,760 గా వుంది.  24 క్యారెట్ల  పది గ్రాముల బంగారం ధర రూ.46,560 వద్ద  కొనసాగుతున్నాయి. 

అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించడం ప్రపంచ మార్కెట్లకు ఊతమిచ్చింది. కరోనా వైరస్ ఆంక్షలను సడలించడం ద్వారా మార్కెట్లలో సెంటిమెంట్  బలడి పెట్టుబడులు ఈక్విటీల  వైపు మళ్లాయి.

also read జీతాలు ఇవ్వలేం: చేతులెత్తేసిన గోఎయిర్‌... సాయం కోసం అభ్యర్ధన

దీంతో మంగళవారం బంగారం ధరలు పడిపోయాయి. స్పాట్ బంగారం 0.1 శాతం తగ్గి ఔన్సు ధర 1699.56 డాలర్లకు చేరుకుంది. అమెరికా బంగారు ఫ్యూచర్స్ 0.5 శాతం తగ్గి ఔన్సుకు 1705.50 డాలర్ల వద్ద వుంది.

అయితే అమెరికా, చైనా మధ్య ముదురుతున్న ట్రేడ్ వార్ భయాలు అటు ట్రేడర్లను, ఇటు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెడుతున్నాయి. దీంతో బంగారం  ఔన్స్ ధర 1700 డాలర్లకు ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని బంగారు రేట్లు ప్రపంచ బంగారు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

ఇవి ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలచే ప్రభావితమవుతాయి. 

click me!