దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేయి దాటింది. ఇప్పటి వరకు 25 కరోనా మరణాలు రికార్డయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా మహారాష్ట్రలోనే ఎక్కువ సంభవించాయి.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేయి దాటింది. కరోనా మరణాల సంఖ్య 25కు చేరుకుంది. కరోనా పాజిటివ్ కేసులు దేశంలో 1037 నమోదయ్యాయి. మహారాష్ట్ర మరోసారి అగ్రస్థానానికి చేరుకుంది. కేరళ రెండో స్థానంలో కొనసాగుతోంది. మరణాల సంఖ్య విషయంలో కూడా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. గుజరాత్ ఐదు మరణాలతో రెండో స్థానంలో ఉంది.
Also Read: లాక్ డౌన్: 200 కిమీ నడిచి, హైవేపై కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు
తెలంగాణ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తెలంగాణలో ఓ కరోనా మరణం కూడా సంభవించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. రాష్ట్రాలవారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఈ కింది విధంగా ఉన్నాయి.
మహారాష్ట్ర 193, మరణాలు 6
కేరళ 182, మరణాలు 1
కర్ణాటక 81, మరణాలు 3
తెలంగాణ 67, మరణాలు 1
ఉత్తరప్రదేశ్ 65
గుజరాత్ 55, మరణాలు 5
రాజస్థాన్ 55
ఢిల్లీ 49, మరణాలు 1
తమిళనాడు 42, మరణాలు 1
మధ్యప్రదేశ్ 39, మరణాలు 2
పంజాబ్ 38, మరణాలు 1
హర్యానా 35
జమ్మూ కాశ్మీర్ 33, మరణాలు 1
పశ్చిమ బెంగాల్ 18, మరణాలు 1
లడక్ 13
బీహార్ 11, మరణాలు 1
అండమాన్ నికోబార్ 9
చండీగడ్ 8
చత్తీస్ గడ్ 7
ఉత్తరాఖండ్ 6
గోవా 3
హిమాచల్ ప్రదేశ్ 3, మరణాలు 1
ఒడిశా 3
మణిపూర్ 1,
మిజోరం 1
పుదుచ్చేరి 1