కరోనా ఎఫెక్ట్: చైనాపై ఆధార పడకుండా... అంతర్జాతీయ ఎక్స్‌పోర్ట్ హబ్ కానున్న భారత్!

By Sandra Ashok Kumar  |  First Published Apr 17, 2020, 2:36 PM IST

కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ ఉత్పాదక రంగం అల్లాడిపోతున్నది. ఆ మహమ్మారి పుట్టిన చైనాలో ఉత్పాదక రంగం నిలిచిపోయి ప్రపంచ దేశాలకు వస్తువుల సరఫరా ఆగిపోయింది. వివిధ దేశాల కంపెనీలు ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా భారత్ ఎగుమతులకు వేదిక కానున్నది. 
 


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బకు అంతర్జాతీయ తయారీ రంగం ఎక్కడికక్కడ ఆగిపోయింది. దీనికితోడు అంతకుముందు సాగిన ట్రేడ్‌‌ వార్‌‌‌‌తో తీవ్రంగా దెబ్బతింటున్న సంస్థలు తమ సప్లయ్‌‌ చెయిన్ కేంద్రాలను చైనా నుంచి మార్చుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. భవిష్యత్‌‌లో సప్లయ్‌‌ చెయిన్‌కు‌ అంతరాయం కలగకుండా ఉండేందుకు కొత్త వేదికలను వెతుకుతున్నాయి. 

ఇటువంటి కంపెనీలను ఆకర్షించేందుకు మోదీ సర్కార్ తగిన వ్యూహం సిద్ధం చేస్తోంది. దీనికోసం ఉన్నతాధికారులు తరచు సమావేశం అవుతున్నారు. ఇండియన్‌‌ ఫార్మా, ఆటోమొబైల్‌‌ వంటి సెక్టార్లు చైనాపై ఎక్కువగా ఆధార పడకుండా, స్థానికంగా సప్లయ్‌ ‌చెయిన్‌‌ను డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. 

Latest Videos

అంతర్జాతీయంగా చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆపిల్‌‌ మాన్యుఫ్యాక్చరింగ్‌‌ పార్టనర్‌‌‌‌ విస్ట్రన్‌‌ కార్ఫ్‌‌ ప్రొడక్షన్‌ కెపాసిటిని చైనాలో తగ్గించుకోవాలని అనుకుంటోంది. ఏడాది లోపు చైనా నుంచి సగానికి పైగా ప్రొడక్షన్‌‌ను షిఫ్ట్ చేస్తామని ప్రకటించింది.

దీంతో పాటు ఇతర ఆపిల్‌‌ పార్టనర్లు హొన్‌‌హై ప్రెసిషన్‌‌, ఇన్వెంటక్‌‌ కార్ప్​, పెగట్రన్‌‌ కార్ప్‌‌ వంటి కంపెనీలు కూడా తమ సప్లయ్‌‌ చెయిన్‌‌ను చైనా నుంచి ఇతర దేశాలకు షిప్ట్‌‌ చేయడానికి సిద్ధమవుతున్నాయి.

aslo read  బంగారానికి కరోనా వైరస్...కొనేవారు లేక తగ్గిన పసిడి డిమాండ్...

కరోనా దెబ్బకు అమెరికాతో సహా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు నష్టపోతున్న విషయం తెలిసిందే. తమ సప్లయ్‌‌ చెయిన్‌‌లను ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకోవడంపై ఇక ఈ దేశాలు దృష్టిపెడతాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 

తమ కంపెనీలను చైనా నుంచి షిఫ్ట్‌‌ చేయడం కోసం జపాన్‌‌ ఇప్పటికే 2.2 బిలియన్‌‌ డాలర్ల భారీ ప్యాకేజిని ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా మంచి స్థాయిలో ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూడా దీనిని అందిపుచ్చుకునేందుకు అనేక చర్యలను మొదలుపెట్టిందని వివరించారు. 

ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రానిక్స్‌‌ మాన్యుఫ్యాక్చరర్లను ఆకర్షించేందుకు పలు చర్యలను తీసుకొంది. దేశంలో మొబైల్‌‌ ఫోన్ల తయారీకి బూస్ట్‌‌ ఇచ్చేందుకు గత నెలలో  మూడు స్కీమ్‌‌లను తెచ్చింది. ఈ స్కీమ్‌‌ల ద్వారా సుమారు రూ. 48వేల కోట్ల విలువైన  ప్రొత్సాహకాలను ప్రకటించింది. ఇందులో ముఖ్యమైనది ప్రొడక్షన్‌‌ లింక్డ్‌‌ ఇన్సెంటివ్ ‌‌(పీఎల్‌‌ఐ) స్కీమ్‌‌.

ఆపిల్‌‌, శామ్‌‌సంగ్‌‌, ఒప్పో వంటి పెద్ద కంపెనీలు తమ వాల్యు చెయిన్‌‌లను ఇండియాలో ఏర్పాటు చేసి, ఇండియాను ఎక్స్‌‌పోర్ట్‌‌ హబ్‌‌గా మార్చేందుకు ఈ స్కీమ్‌‌లు ఉపయోగపడతాయని  ప్రభుత్వం అంచనావేస్తోంది.

click me!