ఐటీ కొలువులకు హైదరాబాద్ బెస్ట్... బట్ బెంగళూరు ఫస్ట్

By Sandra Ashok KumarFirst Published Apr 10, 2020, 11:24 AM IST
Highlights

ఐటీ నిపుణులు బెంగళూరులో పని చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వేతన ప్యాకేజీ విషయంలోనైనా, కెరీర్ పరంగానూ బెంగళూరు బెస్ట్ సిటీ అని పేర్కొంటున్నారు. తర్వాతీ స్థానంలో మన హైదరాబాద్ నిలిచింది. 

బెంగళూరు: ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసేందుకు అత్యంత అనువైన నగరంగా మొదటి స్థానంలో బెంగళూరు నిలిచింది. ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నా ఐటీ నిపుణులు బెంగళూరు నగరానికే ఓటేసినట్లు టెక్​గిగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 

అత్యున్నత జీవన ప్రమాణాలు, వృత్తిలో ఎదుగుదల అవకాశాల పరంగా బెంగళూరు ఉత్తమమైన నగరమని 40 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన ఈ సర్వేలో కనీసం రెండు ఏళ్ల అనుభవం ఉన్న 25-35 ఏళ్ల వయసు కలిగిన 1,830 మంది ఐటీ నిపుణుల అభిప్రాయాలతో టెక్ గిగ్ అధ్యయనం జరిపింది.

వీరిలో 30 శాతం మంది సీనియర్ మేనేజ్మెంట్ రోల్ పోషిస్తున్న వారు ఉన్నారు.ఐటీ ఉద్యోగులు బెంగళూరు తర్వాత హైదరాబాద్​కే మొగ్గుచూపారు. సుమారు 13 శాతం మంది హైదరాబద్​లో ఉద్యోగం చేసేందుకు ఇష్టపడినట్లు సర్వే వెల్లడించింది.

ఆ తర్వాతీ స్థానంలో 11 శాతం ఓట్లతో మహారాష్ట్రలోని పుణె నిలిచింది. అత్యంత ఆదరణ కలిగిన నగరాల్లో ఢిల్లీ-ఎన్​సీఆర్ ప్రాంతం అతి తక్కువ ఓట్లు సాధించినట్లు పేర్కొంది.

బెంగళూరులో అత్యున్నత జీవన ప్రమాణాల ఉన్నట్లు 58శాతం మంది ఉద్యోగులు చెప్పారు. వేతనాల్లో పెరుగుదల వేగంగా ఉంటుందని 71 శాతం మంది, వృత్తిలో ఎదుగుదల-ఉద్యోగవకాశాల ప్రమాణాలు మెరుగ్గా ఉన్నట్లు 68 శాతం మంది బెంగళూరుకు ఓటేశారు.

also read వాట్సాప్ కొత్త రూల్ : ఫెక్ న్యూస్ మెసేజెలకు చెక్...

తమకు ఇష్టంతో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నట్లు 57 శాతం మంది ఐటీ నిపుణులు వెల్లడించారు. భవిష్యత్తులో వేరే నగరానికి మారే అంశంపైనా చాలా మంది విముఖత వ్యక్తం చేశారు.

47 శాతానికి పైగా టెక్ నిపుణులు అత్యున్నత జీవన ప్రమాణాలు, మంచి జీవన శైలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ కెరీర్ అవకాశాలను నిర్ధారించుకుంటున్నట్లు చెప్పారు. 

మంచి శాలరీ ప్యాకేజీ విషయంలోనూ బెంగళూరు తర్వాతీ స్థానం హైదరాబాద్ నగరానిదే. కెరీర్ ఎదుగుదలకు హైదరాబాద్, పుణెల్లో అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

ఫ్రెష్‌గా ఐటీ ఉద్యోగాలు చేసేందుకు ముందుకు వచ్చే వారు కూడా 60 శాతం మంది బెంగళూరు నుంచే తమ కెరీర్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నారు. తర్వాతీ స్థానాల్లో 15 శాతంతో హైదరాబాద్, పుణెలో 14 శాతంతో నిలిచాయి. 

31 శాతం మంది కేరళలో దారుణమైన వాతావరణం ఉంటుందని, 25 శాతం మంది ఢిల్లీలో, 15 శాతం అహ్మదాబాద్ నగరంలో, 14 శాతం విశాఖలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ- దేశ రాజధాని ప్రాంతంలో పని చేయడానికి బదులు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో పని చేయడానికి 21 శాతం మంది ఐటీ నిపుణులు సిద్ధంగా ఉన్నారని ఈ సర్వేలో తేలింది. 

click me!