రంగంలోకి పతంజలి: చైనా ఫార్ములాతో కరోనా పై పోరుకు బాబా రాందేవ్ సై!

By Sree sFirst Published Apr 5, 2020, 7:00 AM IST
Highlights

యోగ గురువు బాబా రామ్ దేవ్ స్థాపించిన పతంజలి కంపెనీ, అల్లోపతే, ఆయుర్వేదాలను కలిపి ఈ వైరస్ పై పోరాటానికి ఒక ఫార్ములాను తీసుకువచ్చింది. 

కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటివరకు మందు లేకపోవడంతో... అన్ని ఒరపంచా దేశాలు కూడా తమ ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పుతున్నప్పటికీ లాక్ డౌన్ ని మాత్రమే ఆశ్రయిస్తున్నాయి.

ప్రపంచంలో వ్యాధులపై పరిశోధన చేసే అనుభవమున్న అన్ని  కంపెనీలు,ప్రభుత్వాలు ఈ వైరస్ కి ఒక మందు కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వాక్సిన్ తాయారు చేయడం కోసం కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంత చేసినా వాక్సిన్ మార్కెట్లోకి రావడానికి కనీసం ఒక సంవత్సర కాలం పడుతుంది. 

ఇది ఇలా ఉండగా, యోగ గురువు బాబా రామ్ దేవ్ స్థాపించిన పతంజలి కంపెనీ, అల్లోపతే, ఆయుర్వేదాలను కలిపి ఈ వైరస్ పై పోరాటానికి ఒక ఫార్ములాను తీసుకువచ్చింది. 

ఇండియాలో 12 గంటల్లో 355 కొత్త కరోనా కేసులు: 68కి చేరిన మృతులు

ఇందులో హైడ్రోక్సీక్లోరోక్విన్ తో పాటుగా అశ్వగంధ, తులసి, గిలోయ్ లను కలిపి తీసుకోవడమా ద్వారా ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొవొచ్చని, ప్రభుత్వానికి తమ పరిశోధనను సమర్పించారు. అంతే కాకుండా తమ పరిశోధనను వైరాలజీ అనే జర్నల్ కి కూడా పంపించారు. ప్రస్తుతం తమ పరిశోధనను మిగిలిన శాస్త్రవేత్తలు అందరూ కూడా లోతైన అధ్యయనం చేస్తున్నారని పతంజలి వర్గాలు తెలిపాయి. 

ఇకపోతే... ఈ మూలికల్లో అశ్వగంధ చాలాబాగా పనిచేస్తుందని వారు తెలుపుతున్నారు. వైరస్ ని శరీరంలోకి రానివ్వకుండానే అశ్వగంధ అడ్డుకోగలుగుతుందని పతంజలి వర్గాలు తమ రీసెర్చ్ పేపర్ లో పేర్కొన్నారు.

ఈ మూడు మూలికల్లోని ఫయిటో కెమికల్స్ సంమర్థవంతంగా ఈ వైరస్ పై ప్రభావం చూపెట్టగలవాని పతంజలి చైర్మన్ బాలకృష్ణ అన్నారు. దాదాపుగా 100 మంది శాస్త్రవేత్తల బృందం ఈ మూలికలపై పరిశోధన చేసిందని ఆయన తెలిపర్రు. ఈ మందును నివారణకు, వైరస్ ను నయం చేయడానికి రెండిటికి కలిపి వాడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

కరోనా వాక్సిన్ రెడీ అంటున్న హైదరబాదీ కంపెనీ: గతంలో స్వైన్ ఫ్లూకి కూడా...

చైనాలో ఎలాగైతే ప్రభుత్వం శాస్త్రీయ మందులతో పాటుగా అల్లోపతే మందులను వాడిందో, భారతదేశంలో కూడా అలానే అల్లోపతే తో పాటుగా శాస్త్రీయ ఆయుర్వేద మందులను కలిపి వాడితే మంచి ప్రయోజనం ఉంటుందని వారు అన్నారు.  

click me!