లైట్ల ఆర్పివేతపై ఆక్షేపణలు: క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

By Sree sFirst Published Apr 4, 2020, 7:19 PM IST
Highlights

లైట్లు కట్టివేయడంపై  కేంద్ర విద్యుత్ శాఖ స్పందించింది. భారతదేశ విద్యుత్ గ్రిడ్లు చాలా పటిష్టంగా ఉన్నాయని, లోడ్ ని మేనేజ్ చేయడం కోసం అన్ని గ్రిడ్లను ఇప్పటికే సంసిద్ధంగా ఉంచామని విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. 

కరోనాపై పోరులో భాగంగా దేశంలో లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఉదయం ప్రజలందరినీ మరో మారు సంఘీభావం తెలపాలని  కోరారు. 

రేపు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని లైట్లు అన్ని కాటేసి, ఎవ్వరి బాల్కనీలోకి, గడపల వద్దకు వారు వచ్చి దీపాల్ని వెలిగించాలని కోరారు. ఇలా కొవ్వొత్తి కానీ, దీపాన్ని గాని వెలిగించలేకపోతే.... కనీసం మొబైల్ లో టార్చ్ లైట్ ను అయినా 9 నిమిషాలపాటు ఆన్ చేయాలనీ ప్రధాని కోరారు. 

 ఇంట్లోని లైట్లన్నీ కట్టేస్తే.... గ్రిడ్ మీద ప్రభావం చూపుతుంది. లోడ్ అంతా డౌన్ అయితే గ్రిడ్ షట్ డౌన్ కి దారి తీస్తుందని, ఉత్పత్తయిన విద్యుత్ ని పంపకం చేసినప్పుడు ఎవ్వరు వాడకపోతే గ్రిడ్ పూర్తిగా షట్ డౌన్ అవుతుందని, ఉదయం నుండి సోషల్ మీడియాలో ప్రచారం సాగడంతోపాటుగా మహారాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి ఏకంగా ప్రజలకు లైట్లు ఆర్పేయవద్దు అంటూ విజ్ఞప్తి కూడా చేసారు. 

Also Read: 9 నిమిషాల జిమ్మిక్కులకు కుదించొద్దు: మోడీపై ఓవైసీ ఫైర్

ఇకపోతే... లైట్లు కట్టివేయడంపై  కేంద్ర విద్యుత్ శాఖ స్పందించింది. భారతదేశ విద్యుత్ గ్రిడ్లు చాలా పటిష్టంగా ఉన్నాయని, లోడ్ ని మేనేజ్ చేయడం కోసం అన్ని గ్రిడ్లను ఇప్పటికే సంసిద్ధంగా ఉంచామని విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. 

కేవలం ఇండ్లలోని లైట్లు మాత్రమే కట్టేయాలని, మిగిలిన అన్ని పరికరాలను ఆన్ చేసే ఉంచాలని విద్యుత్ అధికారులు కోరుతున్నారు. వాటితోపాటుగా వీధి దీపాలు కూడా ఆన్ లోనే ఉంటాయని, వాటిని బంద్ చేయొద్దని ఇప్పటికే పురపాలక, గ్రామా పంచాయితీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు విద్యుత్ శాఖ తెలిపింది. 

వీటితోపాటుగా మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాలు, ఆసుపత్రులు, ఇతరయాత్రలు అన్ని కూడా పూర్తిగా అన్ని లైట్లు ఆన్ లోనే ఉంచుతామని, వారు ఆఫ్ చేయాల్సిన వసరం లేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 

click me!