కరోనాపై గెలుపుకు కఠిన నిర్ణయాలు, పేదలకు క్షమాపణ: మన్‌కీ బాత్‌లో మోడీ

By narsimha lodeFirst Published Mar 29, 2020, 11:58 AM IST
Highlights

కరోనాపై గెలవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. పేద ప్రజలకు కలిగిన ఇబ్బందులకు క్షమాపణలు కోరుతున్నట్టుగా ప్రధాని ప్రకటించారు. 


న్యూఢిల్లీ: కరోనాపై గెలవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. పేద ప్రజలకు కలిగిన ఇబ్బందులకు క్షమాపణలు కోరుతున్నట్టుగా ప్రధాని ప్రకటించారు. 

ఆదివారం నాడు ఆయన మన్‌కీ బాత్ లో ప్రజలతో మాట్లాడారు.కరోనాపై ప్రభుత్వం  విధించిన లాక్‌డౌన్ గురించి ఆయన చర్చించారు. పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకొన్నారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఈ రకమైన కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. 

లాక్‌డౌన్ నిబంధనలను కొందరు ఉల్లంఘిస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఆయన వివరించారు.

భారత్ కు ఇది జీవన్మరణ సమస్య అని ఆయన చెప్పారు. కరోనాపై వైద్య సిబ్బంది నిరంతరం పోరాటం చేస్తున్నారని ఆయన వారిని అభినందించారు. 
లాక్ డౌన్ సమయంలో పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులు, కిరాణ వ్యాపారులు, ఈ -కామర్స్ డెలివరీ సిబ్బంది, ఐటీ రంగంలోని వ్యక్తులను ప్రధాని ప్రశంసించారు. 

also read:గుజరాత్‌లో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరిక: అహ్మదాబాద్‌లో ఒకరి మృతి

హోం క్వారంటైన్ లో ఉండాలని సలహ ఇచ్చినవారి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఉదంతాలు తన దృష్టికి రావడంతో తాను బాధపడినట్టుగా మోడీ గుర్తు చేశారు.ప్రపంచ పరిస్థితులు చూసిన తర్వాతే దేశంలో లాక్ డౌన్ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు.

కరోనా వ్యాప్తి చెందకుడా ఉండాలంటే ప్రజలంతా లక్ష్మణరేఖను మరికొన్ని రోజులు పాటించాల్సిందేనని ప్రధాని కోరారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన ప్రజలను కోరారు.

click me!