కరోనాపై పోరాటంలో విజయం సాధిస్తామని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ధీమాను వ్యక్తం చేశారు.
బెంగుళూరు:కరోనాపై పోరాటంలో విజయం సాధిస్తామని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ధీమాను వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో విజయం సాధిస్తామని సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకొన్నారు.ఈ మేరకు మూడు నిమిషాల వీడియోను ఆయన ట్వీట్ చేశారు.
Day 3/21 of will beat this 🇮🇳
We will win this fight n so lets stay the course with resolve to win this critical battle
Govtdoing its best n so lets do our DUTY. https://t.co/vFhCa9Xetg
21 రోజుల లాక్‌డౌన్ ద్వారా కరోనా వైరస్ పై భారత్ పోరాటం చేస్తోందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ భారత్ లోకి ఇతర ప్రాంతాలనుండి ప్రవేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ప్రజలంతా తమ ఇంటి వద్దే ఉండాలని ఆయన సూచించారు. సోషల్ డిస్టెన్స్ కూడ పాటించాలని ఆయన కోరారు. 21 రోజుల లాక్ డౌన్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొందన్నారు.
కరోనా ప్రభావంతో దేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో జన జీవనం అస్థవ్యస్తంగా మారిందని ఆయన చెప్పారు. ప్రజల జీవన విధానంపై దీని ప్రభావం కన్పించిందన్నారు.ఇంటి వద్దనే ఉండి, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ కోరారు.
కరోనా ఎఫెక్ట్ ఆర్ధిక వ్యవస్థతో పాటు మన ఉద్యోగాలపై, మన జీవితాలపై కూడ ప్రభావం చూపించిందన్నారు ఎంపీ.ఈ విషయాలపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేదల ప్రజలు ఆర్ధికంగా నష్టపోకుండా ఆహరపదార్థాలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ఈ ప్యాకేజీ దోహదం చేస్తోందన్నారు.
ఎన్‌జీఓలతో పాటు పలువురు ఉన్నత ఆశయంతో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. ఆర్ బీ ఐ అన్ని రకాల చర్యలు తీసుకొందన్నారు. అన్ని రంగాల వారికి ఆర్ బీ ఐ తీసుకొన్న చర్యలు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.