కరోనా కలకలం... ఒక్క విందుతో..26వేలమంది క్వారంటైన్ లో...

By telugu news teamFirst Published Apr 6, 2020, 7:18 AM IST
Highlights

మురేనా నగరానికి చెందిన ఓ వ్యక్తి దుబాయిలో ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేసేవాడు. ఇతని తల్లి చనిపోయింది. దీంతో 2020, మార్చి 17వ తేదీన స్వస్థలానికి వచ్చాడు. తల్లి మృతికి సంతాపంగా అందరికీ విందు ఇవ్వాలని అనుకున్నాడు

దేశంలో కరోనా కోరలు చాపుతోంది. రోజు రోజుకీ ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. లాక్ డౌన్ తో పరిస్థితి అదుపులోకి వస్తుందని అందరూ భావించారు. అయితే.. పరిస్థితి మాత్రం తారుమారయ్యింది. భారత్ లో కరోనా కేసులు మూడు వేలు దాటాయి. తాజాగా.. 26వేల మంది ఈ వలయం లో చిక్కుకున్నారు. వీరంతా .. ఓ విందుకు వెళ్లడం ఇప్పుడు అధికారుల తలనొప్పి తీసుకువచ్చింది.

Also Read మోడీ పిలుపుకు అపూర్వ స్పందన: దేశమంతా దీపాల కాంతులు...

ఇంతకీ మ్యాటరేంటంటే....తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి ఇచ్చిన విందు ఎంతో మందిని కలవరపెడుతోంది. విందు ఇచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారిన పడడం..విందుకు వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తొలుత 1500 మందిని క్వారంటైన్ కు తరలించగా..తాజాగా ఈ సంఖ్య 26వేల మందికి చేరుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.  ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

మురేనా నగరానికి చెందిన ఓ వ్యక్తి దుబాయిలో ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేసేవాడు. ఇతని తల్లి చనిపోయింది. దీంతో 2020, మార్చి 17వ తేదీన స్వస్థలానికి వచ్చాడు. తల్లి మృతికి సంతాపంగా అందరికీ విందు ఇవ్వాలని అనుకున్నాడు. అదే నెల 20వ తేదీన విందు ఏర్పాటు చేశాడు. సన్నిహితులు, బంధువులు అందరూ హాజరయ్యారు. సరిగ్గా ఆ సమయంలో  మన దేశంలో కరోనా విజృంభిస్తోంది

అయితే.. సదరు వ్యక్తి తాను దుబాయి నుంచి వచ్చిన విషయాన్ని అధికారుల దృష్టికి రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి..భార్య..అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి వెళ్లగా..కరోనా లక్షణాలు కనిపించాయి. వైద్యాధికారులు ఆరా తీశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. దంపతులిద్దరూ ఏప్రిల్ 02వ తేదీన కరోనా పాజిటివ్ గా తేల్చారు. విందుకు హాజరైన వారందరికి పరీక్షలు చేసి క్వారంటైన్ కు తరలించారు. 

click me!