టయోటా అర్బన్ క్రూయిజర్ గురించి మీకు తెలియని 5 విషయాలు..

By Sandra Ashok Kumar  |  First Published Aug 24, 2020, 6:25 PM IST

తాజాగా అర్బన్ క్రూయిజర్ కోసం బుకింగులను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకోసం టోకెన్ మొత్తాన్ని రూ .11,000 చెల్లించి వినియోగదారులు ప్రీ-బుక్ చేసుకోవచ్చు. 


ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా భారతదేశంలో రాబోయే మారుతి విటారా బ్రెజ్జా ఆధారిత సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ లాంచ్ చేసింది. తాజాగా అర్బన్ క్రూయిజర్ కోసం బుకింగులను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకోసం టోకెన్ మొత్తాన్ని రూ .11,000 చెల్లించి వినియోగదారులు ప్రీ-బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఈ ఎస్‌యూవీని టయోటా డీలర్‌షిప్‌లలో లేదా ఆన్‌లైన్‌ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. టయోటా   అర్బన్ క్రూయిజర్ మీకు తెలియని 5 విషయాల గురించి తెలుసుకుందాం..

1. అర్బన్ క్రూయిజర్ ధర : టయోటా  అర్బన్ క్రూయిజర్ ధర బ్రెజ్జా కారు ధర పరిధిలో ఉంటుందని, అయితే దానితో పోలిస్తే ఇది కాస్త ఖరీదైనదని పేర్కొంది. 
కాంపాక్ట్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ మారుతి కార్లకు ఆధారంగా టయోటాకు రెండవ కారు అవుతుంది. మొట్టమొదటి మారుతి బాలెనో హ్యాచ్‌బ్యాక్, దీనిని గ్లాంజా పేరుతో భారత మార్కెట్లో విక్రయిస్తున్నారు.   

Latest Videos

2. లూక్స్ & డిజైన్ : లుక్, కలర్  అర్బన్ క్రూయిజర్ శేప్స్, డిజైన్ గురించి చెప్పాలంటే ఇది ప్రత్యేకమైన ఫ్రంట్ మెయిన్ గ్రిల్‌ ఉంది, పూర్తి ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్‌తో వస్తుంది. బ్రెజ్జా కారు లాగానే ఇది డైమండ్ కట్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ 6 మోనోటోన్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇందులో బ్లూ, బ్రౌన్, వైట్, ఆరెంజ్, సిల్వర్, గ్రే రంగులు ఉన్నాయి. దీనితో పాటు బ్లూ / బ్లాక్, బ్రౌన్ / బ్లాక్, ఆరెంజ్ / వైట్ అనే మూడు డ్యూయల్ టోన్ రంగులు కూడా లభిస్తాయి.

also read కారు కొంటున్నారా, ఈ ఫీచర్స్ పై ఓ లుక్కే యండి.. లేదంటే.... ...

3. ఇంటీరియర్ :  అర్బన్ క్రూయిజర్ లోపలి ఫీచర్స్ గురించి డ్యూయల్ టోన్ డార్క్ బ్రౌన్ షేడ్ ఉపయోగించారు. టయోటా ఎస్‌యూవీ సౌలభ్యం, సౌకర్యాన్ని అందిస్తుంది. పుష్ స్టార్ట్ అండ్ స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (అన్ని వేరియంట్లలో స్టాండర్డ్), స్మార్ట్ ప్లేకాస్ట్ టచ్‌స్క్రీన్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రోక్రోమిక్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లతో ఈ ఎస్‌యూవీ వస్తుంది.  

4. ఇంజన్:  మెకానికల్ స్పెసిఫికేషన్లు:  అర్బన్ క్రూయిజర్‌కు 1.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో ఇవ్వబడుతుంది. ఇది ఐ‌ఎస్‌జి(ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్) తో అధునాతన లి-ఆన్ బ్యాటరీని కూడా పొందుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ అన్ని ఆటోమేటిక్ వేరియంట్లలో ప్రామాణికంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీకి టార్క్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్, ఐడల్ స్టార్ట్ / స్టాప్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. 

5. మైలేజ్: టయోటా  అర్బన్ క్రూయిజర్ సుజుకి ఎస్‌హెచ్‌వి‌ఎస్ తేలికపాటి-హైబ్రిడ్ టెక్నాలజి పొందుతుంది. విటారా బ్రెజ్జా మాన్యువల్ కంటే అర్బన్ క్రూయిజర్ మాన్యువల్ వేరియంట్లలో అధిక మైలేజీని ఇస్తుంది. లి-అయాన్ బ్యాటరీ ఆటోమేటిక్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది, అర్బన్ క్రూయిజర్ ఆటోమేటిక్ వేరియంట్లకు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుందని భావిస్తున్నారు, అయితే ఈ వేరియంట్ యొక్క మైలేజ్ గణాంకాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

click me!