కంపెనీ 25వేల మొత్తం చెల్లించి ఆన్‌లైన్‌లో అలాగే డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో బుకింగ్‌లు ఓపెన్ చేసింది. కియా మోటార్స్ సంస్థ సోనెట్‌ను ఆంధ్రప్రదేశ్ అనంతపురంలోని ఉత్పత్తి కేంద్రంలో తయారు చేయనుంది. ప్రపంచ మార్కెట్లకు విక్రయించనుంది.
కియా మోటార్స్ సరికొత్త మోడల్ భారతదేశంలో సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ కోసం బుకింగ్‌లు ఆగస్టు 20న ప్రారంభించిన విషయం తెలిసిందే. కేవలం ఒక రోజులో సోనెట్ కారు 6523 బుకింగ్‌లను నమోదు చేసినట్లు కంపెనీ ప్రకటించింది.
కంపెనీ 25వేల మొత్తం చెల్లించి ఆన్‌లైన్‌లో అలాగే డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో బుకింగ్‌లు ఓపెన్ చేసింది. కియా మోటార్స్ సంస్థ సోనెట్‌ను ఆంధ్రప్రదేశ్ అనంతపురంలోని ఉత్పత్తి కేంద్రంలో తయారు చేయనుంది. ప్రపంచ మార్కెట్లకు విక్రయించనుంది.
కియా సోనెట్ 2020 ఆగస్టు 7న భారతదేశంలో ఆవిష్కరించారు. కియా నుండి వచ్చిన మొదటి ఫోర్ మిటర్స్ వాహనం ఇది. హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్‌యువి 300, రాబోయే నిస్సాన్ మాగ్నైట్ పోటీగా నిలుస్తుంది.
also read వాహన ఇన్సూరన్స్ రినివల్ చేస్తున్నారా అయితే జాగ్రత.. లేదంటే జరిమానే.. ...
కియా సోనెట్ కారును ఆంధ్రప్రదేశ్‌లోని అనంత్‌పూర్ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. సెల్టోస్ లాగానే సోనెట్ కూడా రెండు ట్రిమ్ ఆప్షన్స్ వస్తుంది. ఒకటి జిటి లైన్ మరొకటి టెక్ లైన్. వెనిలేటెడ్ సీట్లు, బోస్ సరౌండ్ ఆడియో సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 10.25-అంగుళాల హెచ్‌డి టచ్‌స్క్రీన్, వైరస్ ప్రొటెక్షన్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి క్లాస్-లీడింగ్ ఫీచర్లను సోనెట్ అందిస్తుందని కియా మోటార్స్ హామీ ఇచ్చింది.
సెల్టోస్, కార్నివాల్ లాగానే కియా సోనెట్ సంస్థ యూవిఓ కనెక్ట్ టెక్నాలజీ 57కి పైగా కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి, ఇందులో వాయిస్ అసిస్ట్, మ్యాప్‌ల కోసం ఓవర్-ది-ఎయిర్ అప్ డేట్స్ ఉన్నాయి.
కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూఖ్యూన్ షిమ్ మాట్లాడుతూ, "మా అనంతపూర్ ప్లాంట్ సామర్థ్యంతో పనిచేస్తున్నందున సోనెట్‌ను సాధ్యమైనంత తక్కువ సమయంలో పంపిణీ చేయడానికి కియా మోటార్స్ పూర్తిగా కట్టుబడి ఉందని వినియోగదారులకు నేను భరోసా ఇవ్వాలనుకుంటున్నాను." అని అన్నారు.
కియా సోనెట్ మూడు ఇంజన్ వెరీఎంట్లో వస్తుంది. అవి 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. సోనెట్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ అండ్ ఐఎంటి లేదా ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి.