యు.ఎస్ లో ఉన్న 18 లక్షల అన్నీ టొయోటా ఇంకా లెక్సస్ వాహనాలకు రికాల్ జారీ చేసింది. ఇందులో 2013 మోడల్ సంవత్సరానికి సంబంధించి పాత వాహనాలు కూడా ఉన్నాయి.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన టొయోటా వాటి కార్లకు రికాల్ జారీ చేసింది. యునైటెడ్ స్టేట్స్ లో మొత్తం 18 లక్షల టయోటా ఇంకా లెక్సస్ వాహనాలను కలిగి ఉంది. అయితే యు.ఎస్ లో ఉన్న 18 లక్షల అన్నీ టొయోటా ఇంకా లెక్సస్ వాహనాలకు ఈ రికాల్ జారీ చేసింది.
ఇందులో 2013 మోడల్ సంవత్సరానికి సంబంధించి పాత వాహనాలు కూడా ఉన్నాయి. ఈ రికాల్ ఫ్యుయెల్ పంప్ సమస్యను సంబంధించినట్లు తెలిపింది. దీనిని పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 32 లక్షల వాహనాలకు రీకాల్ వర్తిస్తుంది అని టయోటా మోటార్ కార్ప్ బుధవారం తెలిపింది.
also read మెర్సిడెస్ బెంజ్ కొత్త మోడల్ కారు విడుదల...6 సెకన్లలో 100కి.మీ వేగంతో....
జపాన్ వాహన తయారీదారు మొదట జనవరిలో చెప్పినట్లు 6,96,000 యు.ఎస్ వాహనాలను ఫ్యుయెల్ పంపు కారణంగా రికాల్ చేస్తుంది. ఫ్యుయెల్ పంపు కారణంగా ఇంజిన్ ఆపరేటింగ్ పనిచేయకుండా దారితీస్తుందని చెప్పారు.
టొయోటా వాహన డీలర్లు రికాల్ చేసిన వాహనాలకు ఇంధన పంపులను కొత్త వాటితో భర్తీ చేస్తారు అని తెలిపింది. రీకాల్ ఇప్పుడు ముందుగా యునైటెడ్ స్టేట్స్ లోని అన్నీ వాహనాలు కలిపి 18 లక్షల యు.ఎస్. టయోటా, లెక్సస్ వాహనాలకు జారీ చేసింది.
also read హైదరాబాద్ మార్కెట్లోకి కొత్త బైక్...గంటకు 85 కిలోమీటర్ల వేగంతో...
వీటిలో 2013 మోడల్ సంవత్సరానికి సంబంధించిన పాత వాహనాలు కూడా ఉన్నాయి. టయోటా కంపెనీ జూన్ నెలలో ఇంధన పంపు సమస్యపై కారణాలను గుర్తించింది. వాహన తయారీదారు టొయోటా కంపెనీ ఇంధన పంపు వైఫల్యాలకు సంబంధించిన 66 ఫీల్డ్ రిపోర్టులు, 2,571 వారంటీ క్లెయిమ్‌ల గురించి కూడా తెలుసు అని జనవరిలో యు.ఎస్. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు వాహన తయారీదారు చెప్పారు.
తక్కువ స్పీడ్ తో డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంజిన్ లో సౌండ్, ఇంజిన్ స్టార్ట్ కాక పోవడం, మధ్యలో ఇంజన్ ఆగిపోవడం వంటి సమస్యలను యజమానులు ఫిర్యాదు చేశారు. టొయోటా నివేదికల ప్రకారం దక్షిణ యు.ఎస్ ప్రాంతాలలోని వెచ్చని వాతావరణంలో టొయోటా వాహనాలకు ఎక్కువగా ఇలాంటి సమస్యలు వచ్చాయని చెప్పారు.