టయోటా కిర్లోస్కర్ మోటార్ 1 ఏప్రిల్ నుండి ఎటియోస్ సిరీస్ అన్నీ మోడల్స్ కార్లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.ఎటియోస్ సిరీస్ లో మొత్తం మూడు మోడళ్లను కలిగి ఉంది. అందులో ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్, ఎటియోస్ సెడాన్ ఇంకా ఎటియోస్ క్రాస్.
కస్టమర్ ప్రాధాన్యతలలో మార్పు కారణంగా ఎటియోస్ సిరీస్ లోని ఎటియోస్ లివా, ఎటియోస్, ఎటియోస్ క్రాస్ అలాగే కొరోల్లా ఆల్టిస్ సెడాన్ కార్లు బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు మారవని టయోటా ఇండియా ధృవీకరించింది.
టయోటా కిర్లోస్కర్ మోటార్ 1 ఏప్రిల్ నుండి ఎటియోస్ సిరీస్ అన్నీ మోడల్స్ కార్లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.ఎటియోస్ సిరీస్ లో మొత్తం మూడు మోడళ్లను కలిగి ఉంది. అందులో ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్, ఎటియోస్ సెడాన్ ఇంకా ఎటియోస్ క్రాస్.
undefined
ఎటియోస్ లివా టయోటా లైనప్ నుండి నిలిపివేశాక, టయోటా గ్లాంజా భారత మార్కెట్లో దాని ఎంట్రీ మోడల్ అవుతుంది. ఎటియోస్ సిరీస్ కాకుండా, కార్ల తయారీదారు కొరోల్లా ఆల్టిస్ మిడ్-సైజ్ సెడాన్‌ను కూడా నిలిపివేయనున్నారు.
also read కోలుకొని ఆటోమొబైల్ పరిశ్రమ... ఫిబ్రవరిలో కూడా తగ్గిన సేల్స్...
కస్టమర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్ నుండి ఎంపివిల వైపుకు మారిందని కంపెనీ అభిప్రాయపడింది.జపాన్ కార్ల తయారీ సంస్థ పైన పేర్కొన్న కార్లుకు బిఎస్ 6 అప్ గ్రేడ్ చేపట్టదు అని తెలిపింది.
ఎటియోస్ సిరీస్ కార్లను ప్రవేశపెట్టినప్పటి నుండి ఆశించిన విధంగా సేల్స్ జరిగాయి. కార్ల తయారీదారు అంతకు ముందు జనవరి నుండి ఎటియోస్ సిరీస్ ఉత్పత్తిని నిలిపివేశారు.డీలర్లు ఇప్పుడు బిఎస్ 4 గడువు ముగియక ముందే వాటిని క్లియర్ చేయాలి అని తెలిపింది.
ఎటియోస్ సిరీస్ నిలిపివేయడంపై ఒక వార్తా పత్రిక సంప్రదించగా "మా వినియోగదారుల కోసం బిఎస్ 6 వాహనాలను అందించడానికి టికెఎం పూర్తిగా సన్నద్ధమైంది. మేము ఇప్పటికే 35వేల బిఎస్ 6 వాహనాలను భారతీయ కార్ల మార్కెట్లో విక్రయించాము. జనవరి 27, 2020 నుండి ఫ్యాక్టరీ నుండి మా డీలర్లకు బిఎస్ 6 కార్లు మాత్రమే విక్రయిస్తున్నాము.
also read ఏప్రిల్ నుంచి బిఎమ్‌డబ్ల్యూ కార్ల ఉత్పత్తి నిలిపివేత...
మా కస్టమర్ల అవసరాలను తీర్చడానికి, ఇప్పుడు నిలిపివేసిన లివా, ఎటియోస్‌లకు బదులుగా బిఎస్ 6 ఉద్గారాలతో యారిస్, గ్లాంజాను అందిస్తున్నాము.ఎటియోస్ సిరీస్ కాకుండా, మిడ్-సైజ్ సెడాన్ (సెగ్మెంట్) నుండి ఎంపివిలకు కస్టమర్ ప్రాధాన్యతలో మార్పు చూసిన మేము కొరోల్లా ఆల్టిస్‌ను కూడా నిలిపివేస్తాము. "
దేశవ్యాప్తంగా ఉన్న టయోటా సేవా సంస్థల ద్వారా అన్ని ఎటియోస్ సిరీస్ & కరోలా ఆల్టిస్ కలిగి ఉన్న కస్టమర్ల అవసరాలను తీర్చడం సర్వీస్ లు కొనసాగీస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.ఈ నిలిపివేసిన మోడళ్ల కోసం టయోటా జెన్యూన్ స్పేర్ పార్ట్‌లు దేశంలోని అన్నీ డీలర్‌షిప్‌ల వద్ద వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని టొయోటా ధృవీకరించింది.