ఏప్రిల్ నుంచి బిఎమ్‌డబ్ల్యూ కార్ల ఉత్పత్తి నిలిపివేత...

By Sandra Ashok Kumar  |  First Published Mar 13, 2020, 2:52 PM IST

బిఎమ్‌డబ్ల్యూ ఎట్టకేలకు తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఐ8 ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌ను ఏప్రిల్ 2020 నుండి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
 


ఆరు సంవత్సరాలకు పైగా సేల్స్ జరిపిన తరువాత, బవేరియన్ కార్ల మేకర్ బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కూపే,  ఐ8 రోడ్‌స్టర్ మోడళ్ల  కార్ల ఉత్పత్తిని వచ్చే నెల నుంచి తన లీప్‌జిగ్ ప్లాంట్‌లో ఆపివేయాలని నిర్ణయించింది. బిఎమ్‌డబ్ల్యూ ఎట్టకేలకు తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఐ8 ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌ను ఏప్రిల్ 2020 నుండి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఆరేళ్లకు పైగా సేల్స్ తరువాత, కార్ల తయారీ సంస్థ వచ్చే నెల నుంచి తన లీప్‌జిగ్ ప్లాంట్‌లో ఐ8 కూపే, ఐ8 రోడ్‌స్టర్ మోడళ్ కార్ల ఉత్పత్తిని ఆపేయాలని నిర్ణయించింది.2014లో ప్రపంచ మార్కెట్లో ప్రారంభమైన జర్మన్ కార్ల తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 20వేలకు పైగా యూనిట్లను  విక్రయించింది.

Latest Videos

undefined

also read ఆటోమొబైల్ పరిశ్రమకు కన్నీరు పెట్టిస్తున్న కరోనా వైరస్... కార్ల తయారీపై దెబ్బ...


బిఎమ్‌డబ్ల్యూ   విజన్ ఎఫిషియంట్ డైనమిక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2009 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో  ఈ‌ కార్లను ఆవిష్కరించారు. బిఎమ్‌డబ్ల్యూ ఐ3తో ​​పాటు 2013లో దాని ఉత్పత్తిని ప్రవేశపెట్టారు. సుమారు రూ. 2.29 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో బిఎమ్‌డబ్ల్యూ ఐ8ను 2015 లో భారత మార్కెట్లో విడుదల చేశారు.

అంతేకాకుండా బిఎమ్‌డబ్ల్యూ ఐ8 రోడ్‌స్టర్‌ను ఆటో ఎక్స్‌పో 2018లో కూడా ప్రదర్శించారు, కానీ ఇది భారతీయ మార్కెట్‌లోకి రాలేదు. 2 + 2 గుల్-విండ్ డోర్స్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఫోర్-వీల్-డ్రైవ్‌లతో కూడిన స్పోర్ట్స్ కూపే ప్రపంచంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ కారు. ట్రెడిషనల్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌, ముఖ్యంగా దాని రాడికల్ లుక్స్, ఆధునిక క్యాబిన్ తో కూడిన మరిన్ని ఫీచర్స్ తో అభివృద్ధి చేశారు.

also read హ్యుండాయ్ క్రెటా 2020 సరికొత్త రికార్డు: ఒక్క వారంలోనే ఫుల్ డిమాండ్

అల్యూమినియం చాసిస్, ఇంటెలిజెంట్ కార్బన్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ (సిఆర్‌ఎఫ్‌పి)తో నిర్మించిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8 మూడు సిలిండర్ల 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో, 143 బిహెచ్‌పి ఎలక్ట్రిక్ మోటారు సెటప్‌ దీనిలో  ఉంది. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ద్వారా 250 కిలోమీటర్ల వేగంతో  వెళ్లగలదు. కేవలం 4.4 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడ్ ని  అందుకోగలదు.

click me!