టయోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేరిఎంట్ లలో లభిస్తుంది. డీజిల్ - 2.4-లీటర్ ఇంకా 2.8-లీటర్లతో, 2.7-లీటర్ పెట్రోల్ ఇంజూన్ తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్లన్నీ బిఎస్ 6 కి ప్రమాణాలతో కొత్తగా తయారుచేశారు.
భారతదేశంలో టయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్ 6 వెర్షన్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. దీనిని వినియోగదారులకు ప్రత్యేక ధరలతో అందిస్తామని కంపెనీ తెలిపింది.బుకింగ్ కోసం టోకెన్ గా మొత్తం 50వేలు చెల్లించాలని నిర్ణయించారు. ముంబై, ఢిల్లీ, చెన్నై నగరలలో మేము మాట్లాడిన కొద్ది మంది డీలర్లు బిఎస్ 6 ఇన్నోవా క్రిస్టా డెలివరీలు ఫిబ్రవరి 2020 చివరిలో మాత్రమే ప్రారంభమవుతాయని చెప్పారు.
also read కియా ‘సెల్టోస్’కారు ధరల పెంపు... ఎంత పెరిగిందో తెలుసా...
undefined
టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్ - 2.4-లీటర్, 2.8-లీటర్, 2.7-లీటర్ పెట్రోల్ వెర్షన్ ఉన్నాయి. ఈ ఇంజిన్లన్నీ బిఎస్ 6 కి టెక్నాలజికి చెందుతాయి.భారతదేశంలో ఇన్నోవా క్రిస్టా ధర రూ.14.93 లక్షల నుండి 22 లక్షల వరకు ధర ఉన్నప్పటికీ కంపెనీకి బలమైన అమ్మకాలను నిలుపుకుంటుంది. డీలర్లు బిఎస్ 4 జాబితాలో దాదాపు అన్ని వాహనాలు అమ్ముడయ్యాయని, బిఎస్ తెలిపింది.
టయోటా డీజిల్ వెర్షన్ బిఎస్ 6 ఇన్నోవా క్రిస్టాను సెలెక్టివ్ కాటలిటిక్ రిడక్షన్ (ఎస్సిఆర్) టెక్నాలజీతో పాటు డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ (డిపిఎఫ్) తో తీసుకువచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి టయోటా కంపెనీ అంతర్జాతీయ మార్కెట్ పోర్ట్‌ఫోలియోలో 2.4-లీటర్ ఇంజన్, 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌లను అందిస్తుందని విషయం తెలిసిందే.
also read అతి తక్కువ ధరకే మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు...ధర ఎంతంటే...
ఈ రెండు ఇంజన్లు యాడ్‌బ్లూ టెక్నాలజీని ఉపయోగించుకుంటాయి. భారతీయ వెర్షన్లు భిన్నంగా ఉండకపోవచ్చు అని మేము ఆశిస్తున్నాము..బిఎస్ 6 ఇన్నోవా క్రిస్టా ధర గురించి మరింత తెలుసుకోవడానికి ముందు ఇది బిఎస్4 కంటే ధర ఎక్కువగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. కాబట్టి, ఖచ్చితంగా ధరల విషయంలో పెరుగుదల ఉండే అవకాశం ఉంది.