కియా ‘సెల్టోస్‌’కారు ధరల పెంపు... ఎంత పెరిగిందో తెలుసా...

By Sandra Ashok KumarFirst Published Jan 4, 2020, 1:38 PM IST
Highlights

ముడి సరుకు ధరల పెరుగుదల నేపథ్యంలో దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ కూడా తన సంస్థ మోడల్ కార్ల ధరలు పెంచేసింది. ఈ సంస్థ ఫ్లాగ్ షిప్ కారు ధర రూ.35 వేలు పెరిగింది.

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన సెల్టోస్‌ ఎస్‌యూవీ కారు ధరలను పెంచింది. మోడల్‌ ఆధారంగా రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకు పెంపుదల ఉంటుందని ప్రకటించింది. గతేడాది అగస్టులో విడుదలైన ఈ కారు ప్రారంభ ధర అంతక్రితం రూ. 9.69 లక్షలు ఉంది.

also read  అతి తక్కువ ధరకే మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు...ధర ఎంతంటే...

ధర పెంచిన తర్వాత సెల్టోస్ తర్వాత రూ. 9.89 లక్షలు – 16.29 లక్షలదాకా ఉంటుందని కియా మోటార్స్ కంపెనీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. కియా మోటార్స్ అన్ని మోడల్ కార్లపై రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ధర పెంచినట్లు ఇంతకుముందే తెలిపింది. ఇక మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా, రెనో సంస్థలు గతనెల్లోనే కార్ల ధరలను పెంచాయి. అయితే ఎంత మేరకు ఆ సంస్థలు ధరలు పెంచాయన్నది వెల్లడి కాలేదు.

అదరగొట్టిన రెనో విక్రయాలు 
రెనాల్డ్ ఇండియా కార్ల విక్రయాలు 2019 డిసెంబర్ నెలలో భారీగా పెరిగాయి. 2018 డిసెంబర్ నెలలో 7,263 కార్లు విక్రయిస్తే, గత నెలలో 64.73 శాతం వ్రుద్ధి సాధించింది రెనాల్ట్ ఇండియా. 2019 డిసెంబర్ నెలలో 11,964 కార్లు అమ్ముడు పోయాయి. 2018 పొడవునా 82,368 కార్లను విక్రయించింది రెనాల్ట్. 

also read విద్యుత్​ వాహనాల వినియోగం....కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

2019లో ట్రైబర్, క్విడ్, డస్ట్ వంటి మోడళ్లను పరిచయం చేయడంతో సేల్స్ 7.8 శాతం పెరిగాయి. గతేడాది మొత్తం సేల్స్ 88,869 కార్లను విక్రయించింది. సెవెన్ సీటర్ కెపాసిటీ గల కంపాక్ట్ మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ట్రైబర్ గతేడాది ఆగస్టులో మార్కెట్లోకి విడుదలైంది. నాటి నుంచి ఇప్పటి వరకు 24,412 కార్లు విక్రయించగలిగింది. 
 

click me!