టయోటా నుండి కొత్త మోడల్ ఫార్చ్యూనర్ ...ఇప్పుడు బిఎస్ 6 ఇంజన్ తో...

By Sandra Ashok Kumar  |  First Published Feb 17, 2020, 3:19 PM IST

 కొత్త బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా టయోటా తన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేసింది.అయితే కొత్త ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ధర పాత బిఎస్ 4 మోడల్‌తో పోల్చితే ధరలో ఎలాంటి మార్పు ఉండదు అని కంపెనీ తెలిపింది.


ప్రముఖ అటోమొబైల్ సంస్థ  టయోటా  ఇప్పుడు బిఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా టయోటా ఫార్చ్యూనర్ అమ్మకాలను భారతదేశంలో ప్రారంభించింది. కొత్త బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా టయోటా తన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేసింది.

అయితే కొత్త ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ధర పాత బిఎస్ 4 మోడల్‌తో పోల్చితే ధరలో ఎలాంటి మార్పు ఉండదు అని కంపెనీ తెలిపింది.

Latest Videos

undefined

దీని ప్రస్తుత ధర 28.18 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతుంది. ఫార్చ్యూనర్  బిఎస్ 6 మోడల్ రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఒకటి 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇంకోటి 2.8-లీటర్ డీజిల్ ఇంజన్.

also read 

 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ 245ఎన్‌ఎం పీక్ టార్క్ వద్ద 166హెచ్‌పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయగలదు. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కు గేర్ బాక్స్ అమర్చారు. మరోవైపు, డీజిల్ ఇంజన్ మోడల్ 177 హెచ్‌పి, 420 ఎన్ఎమ్  టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ కలిగి ఉంది .

రెండు ఇంజన్లకు  6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. అయితే, 4×4 డ్రైవ్ సిస్టమ్ ఎస్‌యూవీ డీజిల్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఫార్చ్యూనర్  డీజిల్  ఇంజన్ ఆటోమేటిక్ మోడల్ 450ఎన్‌ఎం వద్ద కొంచెం ఎక్కువ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టయోటా ఫార్చ్యూనర్ బిఎస్ 6 మోడల్ కోసం బుకింగ్స్ గత వారం ప్రారంభమయ్యాయి. అయితే కారు అదే లుక్కింగ్, అదే స్టయిల్ విధంగా ఉంది. కానీ బిఎస్ 6 మోడల్ ధరలను టొయోటా బ్రాండ్ పెంచకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఫార్చ్యూనర్  ఎస్‌యూవీ లోపలి భాగంలో కూడా ఎలాంటి మార్పు లేదు. అదే లెదర్ ఇంటీరియర్, ఎంబెడెడ్ నావిగేషన్‌తో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను దీని లోపల ఉంది. సేఫ్టీ విషయానికొస్తే ఎస్‌యూవీ కారులో  7 ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్ కంట్రోల్, ఎబిఎస్, ఇబిడి ఉన్నాయి.

also read విపణిలోకి కొత్త మారుతి వ్యాగనార్.. వచ్చేనెలలో హ్యుండాయ్ న్యూ మోడల్ కారు...

టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా ఫోర్డ్ ఎండీవర్ నిలుస్తుంది. జనవరి 2020  తాజా అమ్మకాల నివేదిక ప్రకారం ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ బిఎస్ 4 మోడల్ 228 యూనిట్ల అమ్మకాలు చేయగలిగింది. అయితే ఫోర్డ్  ఎండీవర్ మాత్రం 167 యూనిట్ల అమ్మకాల చేసింది. టయోటా ఫార్చ్యూనర్ బిఎస్ 6  వేరియంట్  ధరలు మీకోసం...

పెట్రోల్ వేరియంట్  
ఫార్చ్యూనర్‌ 4x2 మ్యాన్యూయల్ ట్రాన్స్మిషన్ ధర రూ. 28.18 లక్షలు ఉండగా, అదే ఆటోమేటిక్  ట్రాన్స్మిషన్ ధర రూ. 29.77 లక్షలు ఉంది.

డీజిల్ వేరియంట్
ఫార్చ్యూనర్‌ 4x2 మ్యాన్యూయల్ ట్రాన్స్మిషన్ ధర వచ్చేసి రూ.30.19 లక్షలు,
ఫార్చ్యూనర్‌ 4x2 ఆటోమేటిక్  ట్రాన్స్మిషన్ ధర రూ.32.05 లక్షలు,
ఫార్చ్యూనర్‌ 4x2 మ్యాన్యూయల్ ట్రాన్స్మిషన్ ధర వచ్చేసి రూ.32.16 లక్షలు,
ఫార్చ్యూనర్‌ 4x2 ఆటోమేటిక్  ట్రాన్స్మిషన్ ధర  రూ.33.95లక్షలు,
 

click me!