ఆటోమేషన్‌తో భారత దేశంలో 9శాతం ఉద్యోగాలు తగ్గనున్నాయని ఐఎంఎఫ్ డిప్యూటీ ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా 37.5 కోట్ల కొలువులు కొండెక్కనున్నాయి. మొత్తం ప్రపంచ దేశాల్లోని ఉద్యోగితలో ఇది 14%.
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగం శరవేగంగా అభివ్రుద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో లాభాలతోపాటు కష్టాలు, నష్టాలు, సమస్యలు పొంచి ఉన్నాయని ఆచరణలో తేలుతున్నది. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ తదితర విభాగాలు సమాజ ప్రగతిలో కీలకం కానున్నాయి.
ప్రత్యేకించి ఆటోమేషన్ వల్ల దేశంలో తొమ్మిది శాతం మంది కార్మికులు నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని ఐఎంఎఫ్ డిప్యూటీ ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ అంచనా వేశారు.
undefined
దేశ ఆర్థిక వ్యవస్థని మరింత విస్తరించడం వల్ల వీరికి ఉపాధి దొరికే అవకాశం ఉందని ఐఎంఎఫ్ డిప్యూటీ ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) ఆధ్వర్యంలో నిర్వహించిన సి.డి.దేశ్‌ముఖ్ స్మారకోపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఆర్థిక మందగమనాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే దేశ ఆర్థిక వృద్ధి 6-7శాతం ఉండేదని ఐఎంఎఫ్ డిప్యూటీ ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మంది కార్మికులు ఆటోమేషన్ వల్ల నిరుద్యోగులుగా మారనున్నారన్నారు.
also read
ఎక్కువ మంది కార్మికులు, తక్కువ వేతనాలు ఉండే కంపెనీలకు ముప్పు తప్పదని ఐఎంఎఫ్ డిప్యూటీ ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ హెచ్చరించారు.
తాజాగా ఈ నెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో దిగుమతులపై ప్రతిపాదించిన సుంకాల పెంపు నిర్ణయాన్ని లిఫ్టన్ తప్పుబట్టారు. దీని వల్ల దేశీయ మార్కెట్లో పోటీతత్వం తగ్గి.. అంతర్జాతీయ మార్కెట్లతో ఉన్న అనుసంధానాన్ని దేశీయ విపణి కోల్పోతుందని వ్యాఖ్యానించారు.
పోటీతత్వం వల్ల స్వల్పకాలిక ప్రతికూలతలు ఉన్నా, దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు ఉంటాయని ఐఎంఎఫ్ డిప్యూటీ ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ వెల్లడించారు. ఈ అంశాన్ని ఆయన క్రికెట్‌తో ముడిపెట్టి వివరించారు. ‘‘కేవలం దేశీయంగానే ఆడాలని భారత్ నిర్ణయించుకుని ఉంటే ఈనాడు క్రికెట్‌లో ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు’’ అని పేర్కొన్నారు.
మధ్యంతర వస్తువులపై సుంకాలు విధించడం వల్ల ఉద్యోగాల సృష్టికి కారణమయ్యే పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఐఎంఎఫ్ డిప్యూటీ ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలిపారు.
ఆటోమేషన్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మంది అంటే దాదాపు 37.5 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని అన్నారు. తక్కువ వేతనాలు, అధిక కార్మికులు అవసరమైన పరిశ్రమల్లో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు పోయే పరిస్థితి అధికంగా ఉంటుందని లిప్టన్ హెచ్చరించారు.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వృద్ధి రేటు మందగించిందని, దీని ప్రభావం ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌పై పరిమితంగానే ఉంటుందని లిప్టన్ అంచనా వేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు న్యాయ, రెగ్యులేటరీ పరమైన చిక్కులను తొలగించాలని అన్నారు.
గ్రామీణ వినిమయం తగ్గడం, ఎగుమతుల వృద్ధి పతనమవడం, నిరుద్యోగం దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులుగా మారాయని తెలిపారు. కరెంట్ ఖాతా లోటుపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దాన్ని పూడ్చుకునేందుకు మూలధన నిధులను ఆకర్షించాలని కోరారు.
also read స్కోడా మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్
ఇదిలా ఉంటే రుణ భారం పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో నిర్మాణాత్మక, ఆర్థిక రంగ సంస్కరణలు అత్యవసరమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) పేర్కొంది. అలాగే మధ్యకాలిక ఆర్థిక ఏకీకరణ వ్యూహం కూడా ఆవశ్యకమని తెలిపింది.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ఐఎమ్ఎఫ్ ప్రతినిధి గెర్రీ రైస్ మాట్లాడుతూ సంస్థ ఇంతకుముందు అంచనా వేసినదాని కంటే భారత్‌లో ఆర్థిక వాతావరణం బలహీనంగా ఉందన్నారు.బడ్జెట్‌లో కీలక రంగాలకు కేటాయింపులు చేసినా, మరింత నిర్మాణాత్మక, ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని రైస్ అన్నారు.
అందుకు తగ్గ కేటాయింపులు, ఉద్దీపనలు, ఆర్థిక వనరులు సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు.ఐఎమ్ఎఫ్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి అంచనాలను 4.8 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.