టాటా మోటార్స్ విపణిలోకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్ మోడల్ కారును ఆవిష్కరించింది. ఇది మార్కెట్లో కంపెనీకి మంచి పేరు తెచ్చి పెడుతుందని టాటా మోటార్స్ ఎండీ గ్యుంటేర్ బుచెక్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. టాటా మోటార్స్‌లో ఆల్ఫా మాడ్యులర్ ప్లాట్ ఫామ్‌పై లభించే తొలి కారు ఇదే.
ముంబై: దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్ తాజాగా ప్రీమియం హ్యాచ్‌బాక్ కార్ల విభాగంలోకి ప్రవేశించింది. అల్ట్రోజ్‌ను మార్కెట్లోకి విడుదల చేయడంతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి ప్రవేశించినట్లు అయింది. పెట్రోల్ వేరియంట్ కారు ధర రూ.5.29 లక్షల నుంచి రూ.7.69 లక్షలకు, డీజిల్ వేరియంట్ కారు ధర డీజిల్ వెర్షన్ ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.29 లక్షలుగా నిర్ణయించింది.
అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో, ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్‌తో టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారును తీర్చిదిద్దింది.గతేడాది డిసెంబర్‌లో ప్రదర్శించిన ఈ కారును...బీఎస్-6 ప్రమాణాలతో అల్ఫా మాడ్యులర్ ప్లాట్‌ఫాం కింద రూపొందించిన తొలి డీజిల్ కారు ఇదేనని టాటా మోటార్స్ వర్గాలు వెల్లడించాయి. రెండు వేరియంట్ల ఇంజిన్ ఆప్షన్లతో 5-స్పీడ్ మాన్యువల్ స్టాండర్డ్ గేర్‌బాక్స్‌తో ఆవిష్కరించింది.
undefined
also read హ్యుందాయ్ నుండి కొత్త కార్ లాంచ్... బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి...
తమ ఆల్ట్రోజ్ వినియోగదారులకు బంగారం లాంటి అనుభవాన్ని ఇస్తుందని, హాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఈ వాహనం తమకు మంచి గుర్తింపునివ్వనుందని టాటా మోటార్స్ పేర్కొంది. టాటా అల్ట్రోజ్‌తో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టినట్లు, భవిష్యత్‌లో కాలుష్యాన్ని నియంత్రించే వాటిపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు టాటా మోటర్స్ ఎండీ, సీఈవో గ్యుంటర్ బుచెక్ తెలిపారు.
ఈ నూతన ప్రీమియం హ్యాచ్‌బాక్‌లో భాగంగా ప్రవేశపెట్టిన అల్ట్రోజ్ కారు దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న అన్ని రిటైల్ ఔట్‌లెట్లలో లభిస్తుందని గ్యుంటెర్ బుచెక్ పేర్కొన్నారు. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని 1.2 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 86 బీహెచ్‌పీ పవర్, 113ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ 90 బీహెచ్‌పీ పవర్, 200ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది.
ఎల్ఈడీ డీఆర్ఎల్స్ గల ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, సమీ-డిజిటల్ ఇన్‌స్ట్రమెంట్ క్లస్టర్, 7.0 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెదర్ ఫినిషింగ్‌తో మల్టిపుల్ కంట్రోల్ బటన్స్ స్టీరింగ్ వీల్, విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. రేర్ ఏసీ వెంట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, హై స్పీడ్ లిమిటర్, రెండు ఎయిర్ బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన యాంటీ బ్రేకింగ్ సిస్టం తదితర ఫీచర్లను జత చేశారు.
also read బీఎస్-6 బాటలో కొత్త మోడల్ కార్లు, బైక్‌లు, స్కూటీలు...
టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్ జెడ్, ఎక్స్‌జెడ్(ఒ) నాలుగు వేరియంట్లలో లభించనుంది. ఇక మార్కెట్‌లో మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుండాయ్ ఎలైట్ ఐ20, హోండా బాజ్ మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నదని అంచనా. ఇదివరకే టాటా మోటార్స్ నెక్సాన్, టియాగో, టిగోర్‌లను బీఎస్-6 వెర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లోకి 1.2 లీటర్ల రివోట్రాన్ టర్బోచార్జ్ పెట్రోల్ బీఎస్-6 ఇంజిన్‌తో తయారైన నూతన నెక్సాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.95 లక్షలుగా నిర్ణయించింది.
అలాగే రూ.4.6 లక్షల విలువైన 1.2 లీటర్ల రెవోట్రాన్ పెట్రోల్ బీఎస్-6 ఇంజిన్ కారు, రూ.5.75 లక్షల ధర కలిగిన టిగోర్ 2020ని కూడా ప్రవేశపెట్టింది. టియాగో, టిగోర్‌లు క్రాష్ టెస్ట్‌లో పాసయ్యాయి. గ్లోబల్ ఎన్‌సీఏపీ నిర్వహించిన క్రాష్ పరీక్షలో ఈ రెండు కార్లకు 4 స్టార్ రేటింగ్ లభించింది.