హ్యుందాయ్ నుండి కొత్త కార్ లాంచ్... బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి...

By Sandra Ashok Kumar  |  First Published Jan 21, 2020, 3:48 PM IST

హ్యుందాయ్ ఆరా కారు 5 కీ వేరియంట్లలో ఇంకా 6 కలర్లలో అందుబాటులోకి రానుంది. హ్యుందాయ్ ఆరా కారు ధర రూ. 5.80 లక్షల నుంచి రూ. 9.22 లక్షల వరకు ఉంటుంది.


దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ సరికొత్త సబ్ కాంపాక్ట్ సెడాన్ అయిన హ్యుందాయ్ ఆరా  కారును భారతదేశంలో లాంచ్ చేశారు. దీని ప్రారంభ ధర 5.80 లక్షల నుండి 9.22 లక్షలు ఉంటుంది (ఎక్స్-షోరూమ్, ఇండియా).హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఆధారంగా, కొత్త హ్యుందాయ్ ఆరా కారు  ఎక్సెంట్ కొత్త-జెన్ మోడల్ కార్ అని చెప్పొచ్చు.

హ్యుందాయ్ ఆరా గ్రాండ్ ఐ10 నియోస్, ఓల్డ్-జెన్ గ్రాండ్ ఐ10 లతో సమానమైన ఎక్సెంట్‌తో కలిపి ఉంటుంది. ఈ కారు ఐదు కీ వేరియంట్లలో అందిస్తున్నారు. ఆరు కలర్ ఆప్షన్లలో మార్కెట్లోకి  రానుంది. మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ వంటి కార్లకు మంచి  పోటీగా ఉంటుంది.

Latest Videos

undefined

also read బీఎస్-6 బాటలో కొత్త మోడల్ కార్లు, బైక్‌లు, స్కూటీలు...

హ్యుందాయ్ ఆరా రెండు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది ఇంకా  ఇది బిఎస్ 6 కంప్లైంట్ కూడా.1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 82 బిహెచ్‌పి వద్ద  114 ఎన్ఎమ్ టార్క్. 1.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 74 బిహెచ్‌పి వద్ద  190 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది.

ఈ రెండూ వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్ ఇంకా  ఆప్షనల్ AMT ట్రాన్స్మిషన్కు జతచేయబడ్డాయి. హ్యుందాయ్ 1-లీటర్ జిడిఐ టర్బో -పెట్రోల్ ఇంజిన్‌ కూడా అందిస్తోంది. 99 బిహెచ్‌పి వద్ద 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది.

దీనికి ముందు భాగంలో ట్విన్ బూమేరాంగ్ ఆకారంలో ఉన్న LED DRL లతో క్యాస్కేడింగ్ గ్రిల్ ఉంటుంది.హెడ్‌ల్యాంప్‌లు, ప్రొజెక్టర్ లైట్లు ఇంకా  క్రోమ్ బెజెల్స్‌తో రౌండ్ ఫాగ్‌ల్యాంప్‌లతో వస్తుంది. కారులో కూపే లాంటి సన్ రూఫ్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

వెనుక భాగంలో బూట్ స్పేస్ లో కొత్త  మార్పులు  చేశారు. 3డి ఔటర్ లెన్స్‌తో కూల్ లుకింగ్ టెయిల్ లాంప్‌ కారుని మొత్తం కొత్త మారుస్తుంది.హ్యుందాయ్ ఆరా కారు పొడవు 3,995mm, 1,680mm వెడల్పు, 1,520mm ఎత్తు ఉంటుంది. దీనికి 2450mm వీల్‌బేస్, 402 లీటర్ల బూట్ స్పేస్  కల్పించారు. మొత్తం కారు మరింత ఏరోడైనమిక్‌గా ఉండేలా రూపొందించారు.

also read కియా మోటార్స్ నుండి మరో రెండు కొత్త మోడల్ కార్లు....

కారు లోపల గ్రాండ్ ఐ 10 నియోస్‌కు సమానమైన క్యాబిన్‌ను పొందుతుంది. అదే విధమైన లైట్- డాష్‌బోర్డ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కలిగి ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.ఇతర ఫీచర్లలో పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్-స్టాప్ ఫంక్షన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం ఫిట్-అండ్-ఫినిష్ వంటివి ఉన్నాయి.

భద్రతా ఫీచర్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ బ్రేక్స్, ఇబిడిలతో పాటు సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు స్టాండర్డ్ గా ఉన్నాయి.ఈ కారు వెనుక పార్కింగ్ కెమెరా సెన్సార్లు, కీలెస్ ఎంట్రీ, హై-స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ , ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్ ఫంక్షన్‌ కూడా ఉన్నాయి.

click me!