సుజుకి నుండి కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్...ధర ఎంతో తెలుసా...

By Sandra Ashok Kumar  |  First Published Dec 30, 2019, 5:17 PM IST

సుజుకి బ్రాండ్ ఈ కొత్త హస్ట్లర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ  ధర, టెక్నికల్ వివరాలను వెల్లడించింది. సెకండ్-జెన్ హస్ట్లర్ ధర 4×2 వేరియంట్‌కు 1,612,600 యెన్ (ఇండియన్ ధరలో 10.45 లక్షలు) నుండి మొదలవుతుంది.


సుజుకి కంపెనీ నుండి ఒక కొత్త హస్ట్లర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కారుని జపాన్‌లో అధికారికంగా ప్రదర్శించారు. సుజుకి బ్రాండ్ ఈ కొత్త హస్ట్లర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ  ధర, టెక్నికల్ వివరాలను వెల్లడించింది. సెకండ్-జెన్ హస్ట్లర్ ధర 4×2 వేరియంట్‌కు 1,612,600 యెన్ (ఇండియన్ ధరలో 10.45 లక్షలు) నుండి మొదలవుతుంది, 4 × 4 వేరియంట్ టాప్ మోడల్‌కు 1,790,800 యెన్ (ఇండియన్ ధరలో 11.62 లక్షలు) వరకు ఉంటుంది.

also read అత్యధికంగా అమ్ముడైన టు -వీలర్‌ ఏదో తెలుసా...?

Latest Videos

undefined


వాగన్ఆర్ కొత్త మోడల్‌కు అండర్‌పిన్నింగ్స్‌ను అందించే సుజుకి హిర్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా సుజుకి హస్ట్లర్ అదే రెట్రో స్టైలింగ్‌ను కలిగి ఉంది. అయితే బ్రాండ్ దానికి కాస్మెటిక్ మార్పులను చేశారు.జపాన్ లో లైట్ ప్యాసెంజర్ వాహనాల కోసం కేయి కారు నిబంధనల ప్రకారం ఈ కారు ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. బ్రాండ్ మరింత కాంపాక్ట్ ఎస్‌యూవీని క్యాబిన్‌లో ఎక్కువ లెగ్‌రూమ్‌ అందిస్తోంది ఇందుకోసం వీల్‌బేస్ 35 ఎంఎం పెంచింది.

సుజుకి హస్ట్లర్ కార్ ఎక్స్టియర్  ఇప్పుడు ఎల్‌ఈడీ ప్లస్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ సెటప్‌ను ఫ్రంట్ కేసింగ్‌లో ఉంచారు, టెయిల్ లైట్ ఇంకా వెనుక బంపర్ కూడా రి డిజైన్ చేశారు. కాంపాక్ట్ ఎస్‌యూవీలో బాక్సీ డిజైన్ లాంగ్వేజ్ ఉంటుంది. అయితే ఇంటీరియర్‌ లోపల భారీగా అడ్జస్ట్ మెంట్లు చేశారు.

 


అప్ డేట్ చేసిన ఎస్‌యూవీలో రిడిజైన్ చేసిన డాష్‌బోర్డ్ అమర్చి ఉంటుంది. డాష్‌బోర్డ్ ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంది. అయితే కారు మరింత కొత్త యంగ్ లుక్ తో కనిపిస్తుంది. డాష్‌బోర్డ్ మధ్యలో బాడీ-కలర్ హౌసింగ్‌కు అనుసంధనం చేసిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కన్సోల్ ఉంది.

హస్ట్లర్ కారులో మరింత సౌకర్యవంతమైన సీట్లను అమర్చారు. ఇంకా అప్ డేట్ చేసిన అనలాగ్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా ఉంది. ఎస్‌యూవీ  గేర్ లివర్ డాష్‌బోర్డ్‌లో కొత్తగా అమర్చచారు. అడ్జస్ట్ చేయగల సీట్లు ఇప్పుడు లాస్ట్-జెన్ మోడల్‌తో పోలిస్తే మరింత సౌకర్యాన్ని కలిగిస్తాయి.

also read 2020పైనే ఆటోమొబైల్ ఆశలు... పెరుగనున్న వెహికల్స్ ధరలు


 సుజుకి హస్ట్లర్‌ కారులో సహజంగా ఆశించిన 658 సిసి 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ రెండు ఆప్షన్ లో లభిస్తుంది. స్టాండర్డ్ ఇంకా  టర్బోచార్జ్డ్. ఇంజిన్  స్టాండర్డ్ వెర్షన్ గరిష్ట శక్తి 49HP మరియు 58Nm టార్క్ అందించగలదు. టర్బోచార్జ్డ్ వెర్షన్ 64HP శక్తితో మరియు 98Nm పీక్ టార్క్ అందిస్తుంది. 

 ట్రాఫిక్ సైన్ గుర్తించడానికి, పదాచారులను గుర్తించడానికి ఇందులో కెమెరా-గైడెడ్  సిస్టం, క్రూయిజ్ కంట్రోల్ వంటి మరిన్ని అధునాతన డ్రైవర్ ఆసిస్టన్స్ సిస్టంలో ఈ బ్రాండ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కలిగి ఉంది. జపాన్ మార్కెట్‌కు మాత్రమే అనుకూలంగా ఉండే కేయి నిబంధనల ప్రకారం సుజుకి హస్ట్లర్ తయారు చేశారు. ఇది భారత మార్కెట్లోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది అనే దానిపై సమాచారం లేదు.
 

click me!