మారుతి సుజుకి డిజైర్ మోడల్ సెడాన్ కారు విక్రయాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే 1.2 లక్షలకు పైగా కార్లు అమ్ముడు పోయాయి. దేశీయ మార్కెట్లో 60 శాతానికి పైగా డిజైర్ మోడల్ దేనని మారుతి సుజుకి వెల్లడిస్తోంది.
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కాలంలో భారత వాహన రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నా ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి సెడాన్ మోడల్ కారు ‘డిజైర్’కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో అత్యధిక విక్రయాలతో తొలి స్థానంలో నిలిచింది.
ఏప్రిల్-నవంబర్ నెలల మధ్య 1.2లక్షల ‘డిజైర్’ కార్లు అమ్ముడు పోయినట్లు మారుతి సుజుకి మంగళవారం ప్రకటించింది. ప్రతి ఏటా భారీ విక్రయాలు నమోదు చేస్తున్న మారుతి డిజైర్ మోడల్ కారు ఇటీవలే 20లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఒక్క 2018-19లోనే 2.5లక్షల కార్లు అమ్ముడు పోవడం గమనార్హం.
undefined
also read పెట్రోల్, ఛార్జింగ్ అవసరం లేకుండా నడిచే కొత్త కార్
స్విఫ్ట్ డిజైర్ తొలితరం మోడల్ 2008లో మార్కెట్లోకి వచ్చింది. తర్వాత కొన్ని మార్పులతో 2012లో రెండోతరం రోడ్లపైకి ప్రవేశించింది. ప్రస్తుతం ఉన్న మూడోతరం డిజైర్ పేరిట 2017లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. మార్కెట్లో ఉన్న కాంపాక్ట్ సెడాన్ విభాగంలో దశాబ్ద కాలంగా అత్యుత్తమ కారుగా డిజైర్ ప్రసిద్ధి పొందింది. డిజైన్, వసతులు, ఇంటీరియర్ రూపకల్పన, భద్రత విషయంలో అత్యుత్తమ ప్రమాణాలు ఉన్న కారుగా డిజైర్ పేరుగాంచింది.
ఎల్‌ఈడీ ప్రొజెక్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రేర్ ఏసీ వెంట్స్, స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, ఆండ్రాయిడ్, యాపిల్ కార్ ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్, 4 సిలిండర్లతో వచ్చే ఇంజిన్ 82 బీహెచ్‌పీ శక్తిని, 114 ఎన్.ఎమ్ టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇక 1.3 లీటర్ వచ్చే డీజిల్ ఇంజిన్ 74 బీహెచ్‌పీ శక్తి, 190 ఎన్‌ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
also read సుజుకి నుండి కొత్త 125సిసి బిఎస్ 6 ఇంజన్ బైక్...
తాజాగా మారుతి సుజుకి డిజైర్ సెడాన్ మోడల్ కారుకు దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ ‘ఔరా’ మోడల్ కారు పోటీగా వస్తోంది. ఇంకా హ్యుండాయ్ ఎక్స్ సెంట్, హోండా అమేజ్, ఫోర్డ్ అస్పైర్, టాటా టైగోర్, వోక్స్ వ్యాగన్ ఆమియో మోడల్ కార్ల నుంచి గట్టి పోటీ ఎదుర్కోనున్నది మారుతి సుజుకి. వినియోగ దారులకు డిజైర్ ఆరు రంగులు- ఆక్స్ ఫర్డ్ బ్లూ, గాల్లాంట్ రెడ్, షేర్ వుడ్ బ్రౌన్, మాగ్మా గ్రే, సిల్కీ సిల్వర్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ రంగుల్లో లభిస్తోంది.
హార్ట్ టెక్ ప్లాట్ ఫామ్ వేదికగా కంపాక్ట్ సెడాన్ మోడల్‌గా డిజైర్ నిలిచింది. దేశీయ మార్కెట్లో 60 శాతానికి పైగా వాటా డిజైర్ మోడల్ కారుదేనని మారుతి సుజుకి పేర్కొంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది మారుతి డిజైర్. ఎల్ఎక్స్ఐ లేదా ఎల్డీఐ, వీఎక్స్ఐ లేదా వీడీఐ, జడ్ఎక్స్ఐ లేదా జడ్డీఐ, జడ్ఎక్స్ఐ ప్లస్ లేదా జడ్డీఐ ప్లస్ మోడళ్లలో అందుబాటులో ఉంటుంది.