బీఎస్-‌4 వాహనాలకు షాక్.. రిజిస్ట్రేషన్లకు సుప్రీంకోర్టు బ్రేక్‌..

By Sandra Ashok KumarFirst Published Aug 1, 2020, 11:35 AM IST
Highlights

తదుపరి ఉత్తర్వుల వరకు బీఎస్ 4 కంప్లైంట్ వాహనాల రిజిస్ట్రేషన్ సుప్రీంకోర్టు నిషేధించింది. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ప్రకటించిన లాక్ డౌన్ సందర్భంగా మార్చిలో పెద్ద సంఖ్యలో విక్రయించిన వాహనాలపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 

వాహనాల తయారీ బి‌ఎస్ 4 నుండి బి‌ఎస్ 6కు అప్ గ్రేడ్ చేయాలన్న నిబంధనలు మీకు తెలిసిందే. తాజాగా బీఎస్ ‌4 ప్రమాణాల వాహనాల రిజిస్ట్రేషన్‌కు అడ్డు పడింది. తదుపరి ఉత్తర్వుల వరకు బీఎస్ 4 కంప్లైంట్ వాహనాల రిజిస్ట్రేషన్ సుప్రీంకోర్టు నిషేధించింది.

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ప్రకటించిన లాక్ డౌన్ సందర్భంగా మార్చిలో పెద్ద సంఖ్యలో విక్రయించిన వాహనాలపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఆగస్టు 13న సుప్రీం కోర్టు విచారించనుంది.

బిఎస్ 6 ఉద్గార నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో అమల్లోకి వచ్చాయి. దేశంలో బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ గడువు మార్చి 31తో  ముగిసింది. జూలై 8న సుప్రీంకోర్టులో మార్చి 27న ఇచ్చిన ఉత్తర్వులను రీకాల్ చేసింది.

also read 

లాక్‌డౌన్‌ ఎత్తివేశాక 10 రోజుల వ్యవధిలో డీలర్‌షిప్‌లు అమ్ముడుపోని బిఎస్ 4 జాబితాలోని 10 శాతం వాహనాలను మాత్రమే విక్రయించవచ్చని, అలాంటి వాహనాలను విక్రయించిన 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సుప్రీంకోర్టు మార్చి 27న ఉత్తర్వులలో పేర్కొంది.

అంతేకాకుండా, లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత అప్పటికే విక్రయించిన, లాక్ డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ కానీ బిఎస్ 4 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ గడువును మే 31 వరకు పొడిగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు ఫిబ్రవరిలో మార్చి 31 గడువును పొడిగించాలని కోరుతూ ఎఫ్‌ఏ‌డి‌ఏ  పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
 

click me!