2015 లో ప్రారంభించినప్పటి నుండి, క్రెటా పరిశ్రమలో ఒక బెంచ్ మార్క్, ఇది 4.85 లక్షలకు పైగా విలువైన కస్టమర్లకు సాధించింది. మే-జూన్ నెలల్లో అత్యధిక అమ్మకాలను సాధించి ఎస్‌యూవీ విభాగంలో టాప్‌లో ఉందని అని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్) తరుణ్ గార్గ్ చెప్పారు.
న్యూ ఢీల్లీ: ప్రముఖ కార్ల తయారీ దారి హ్యుందాయ్ క్రేట కార్ల బుకింగ్‌లలో అదరగొడుతుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) ఇటీవల లాంచ్ చేసిన క్రెటా కొత్త వెర్షన్ 55,000 బుకింగ్‌లు అందుకున్నట్లు బుధవారం తెలిపింది.
"2015 లో ప్రారంభించినప్పటి నుండి, క్రెటా పరిశ్రమలో ఒక బెంచ్ మార్క్, ఇది 4.85 లక్షలకు పైగా విలువైన కస్టమర్లకు సాధించింది. మే-జూన్ నెలల్లో అత్యధిక అమ్మకాలను సాధించి ఎస్‌యూవీ విభాగంలో టాప్‌లో ఉందని" అని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్) తరుణ్ గార్గ్ చెప్పారు.
మార్చిలో కొత్త వెర్షన్ క్రెటా ప్రారంభించడంతో కంపెనీ మరోసారి ఈ ఎస్‌యూవీ విభాగంలో ఆధిపత్యాన్ని నెలకొల్పిందన్నారు. కేవలం నాలుగు నెలల్లో 55,000 బుకింగ్‌లు, 20,000 మందికి పైగా కస్టమర్లతో రికార్డ్ నెలకొల్పింది.
also read
లాక్ డౌన్ సమయంలో కూడా ఈ ఘనత, భారతదేశం అంతటా కస్టమర్ల హృదయాలను గెలుచుకోవడం కొత్త వెర్షన్ ఫీచర్స్, ఎస్‌యూవీ పనితీరుకు ఈ విజయం నిదర్శనం అని గార్గ్ గుర్తించారు.
1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో హ్యుందాయ్ క్రెటా 2020 మార్కెట్‌లో అందుబాటులో ఉన‍్న సంగతి తెలిసిందే. క్రెటా బుకింగ్స్‌లో డీజిల్ వేరియంట్ల ప్రాముఖ్యత పెరుగుతూనే ఉంది.
ఇప్పుడు అందుకున్న మొత్తం బుకింగ్‌లలో 60 శాతం ఇవే ఉన్నాయి. ఇది సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన బిఎస్6 టెక్నాలజీకి బలమైన డిమాండ్‌ను సూచిస్తుంది.