చరిత్రలోనే ఫస్ట్ టైం.. 80 శాతం తగ్గిన మారుతీ సుజుకి విక్రయాలు..

By Sandra Ashok Kumar  |  First Published Jul 30, 2020, 10:56 AM IST

. ఈ త్రైమాసికంలో కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల  సేల్స్ భారీగా దెబ్బతీసింది. 


దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా బుధవారం ఏప్రిల్-జూన్ కాలంలో రూ .249.4 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల  సేల్స్ భారీగా దెబ్బతీసింది. ఏడాది క్రితం ఇదే సమయంలో 1,435.5 కోట్ల రూపాయల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది.

1. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి సుజుకి ఉత్పత్తుల సేల్స్ ద్వారా ఏప్రిల్-జూన్ మధ్యలో  రూ .3,677.5 కోట్ల ఆదాయం వచ్చిందని, కిందటి ఏడాదితో పోలిస్తే 80.37 శాతం క్షీణించిందని చెప్పారు.

Latest Videos

2. మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మొత్తం 76,599 వాహనాలను విక్రయించింది. దేశీయ మార్కెట్లో 67,027 వాహనాల సేల్స్, 9,572 యూనిట్ల ఎగుమతులు ఇందులో ఉన్నాయి.

3. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ .5,424.8 కోట్లు, ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 73.61 శాతం పడిపోయింది.

4. ఏదేమైనా మొత్తం ఖర్చులలో మెటీరియల్ ఖర్చు, ఫైనాన్స్ వంటి ఇతర అంశాలతో సహా 69.05 శాతం తగ్గి ఏడాది క్రితం నమోదైన రూ.18,645.3 కోట్ల నుండి రూ .5,770.5 కోట్లకు చేరుకున్నాయి.

also read  

5.  కోవిడ్-19 వ్యాప్తి  ప్రభావం, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఫలితాలను మునుపటి త్రైమాసికాలతో పోల్చడానికిలేదని మారుతి సుజుకి తెలిపింది.

6. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏప్రిల్-జూన్ కాలంలో "కంపెనీ చరిత్రలోనే గుర్తుండిపోయే  త్రైమాసికం" అని మారుతి సుజుకి చెప్పారు.

7. ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్-19  లాక్‌డౌన్‌ మూడు నెలల కాలంలో జీరో ఉత్పత్తి, జీరో అమ్మకాలు అని కంపెనీ తెలిపింది.

8. మేలో ఉత్పత్తి, అమ్మకాలు రెండూ "చాలా తక్కువలో ప్రారంభమయ్యాయి" అని మారుతి సుజుకి  తెలిపింది.

9. మారుతి సుజుకి షేర్లు 2.65 శాతం క్షీణించి బిఎస్‌ఇలో ఒక్కొక్కటి రూ .6,120.40 వద్ద కోట్ అయ్యాయి.

10. నిన్న మధ్యాహ్నం 2:16 గంటలకు మారుతి సుజుకి షేర్లు 2.31 శాతం తగ్గి రూ .6,142 వద్ద ట్రేడయ్యాయి.

click me!