సోనీ కంపెనీ నుండి మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్...

By Sandra Ashok Kumar  |  First Published Jan 9, 2020, 3:31 PM IST

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సిఇఎస్) లో కొనసాగుతున్న ఆటొ షోలో  సోనీ కంపెనీ విజన్ ఎస్ సెల్ఫ్ డ్రైవింగ్ కారును చూపించింది. అయితే, ఈ కారును ప్రజలకు ఎప్పుడు పరిచయం చేస్తుందని అనే దాని పైన సోనీ  సమాచారం ఇవ్వలేదు.


ప్రపంచంలోని అతిపెద్ద టెక్ షో అయిన సి‌ఈ‌ఎస్(CES) 2020 లో సోనీ కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ కారును ప్రదర్శించడంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. విజన్ ఎస్ అని  పిలువబడే ఈ ప్రోటోటైప్ కారు సెన్సార్లు, ఇన్-కార్ ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీలలో సోనీ  ప్రొవేస్ ప్రదర్శించింది. అయితే, ఈ కారును ప్రజలకు ఎప్పుడు పరిచయం చేయబోతుంది అనే సమాచారం ఇవ్వలేదు.

also read ఆటోమొబైల్ రంగంపై కార్మిక సమ్మె ఎఫెక్ట్... మూడు వేల మంది అరెస్ట్...

Latest Videos

undefined


సోని విజన్ ఎస్ కారు ఎల్లప్పుడూ ఆన్-కనెక్టివిటీని కలిగి ఉంటుంది. కారు లోపల ఇంకా  బయట 33 సెన్సార్లను కలిగి ఉంటుంది. మల్టీ వైడ్ స్క్రీన్ డిస్ ప్లేలు, 360-డిగ్రీల ఆడియో సిస్టం ఉన్నాయి. ఇంకా ఏమిటంటే, వినోద ప్రయోజనాల కోసం స్టాండర్డ్ డాష్‌బోర్డ్ కోసం పనోరామిక్ స్క్రీన్ కూడా ఉంది. బాష్, క్వాల్కమ్, బ్లాక్‌బెర్రీ, మాగ్నా, కాంటినెంటల్, ఎన్విడియాతో సహా ఒక ప్రోటో టైప్ రూపొందించడానికి చాలా బ్రాండ్లు, టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు సోనీ ప్రకటించింది.

దీనిపై ఎక్కువ వివరాలు అందుబాటులో లేవు, కానీ ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కారు అని తెలిపింది.ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సోనీ సీఈఓ కెనిచిరో యోషిడా మాట్లాడుతూ సంస్థ “లిడార్” విజన్ సెన్సింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది, ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల భద్రత ఇంకా కార్యాచరణలో కీలకమైన భాగం.

also read మార్కెట్లోకి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్...ఫీచర్స్, ధరెంతంటే!!

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో ఉపయోగించే ప్రస్తుత జెనరేషన్ సెన్సార్లు పెద్దగా ఉండటమే కాకుండా ఇవి ఖరీదైనవి కూడా. సోనీ కంపెనీ దీనికి బదులు కొత్త "సాలిడ్-స్టేట్" లిడార్‌ను అభివృద్ధి చేసింది. ఇది మరింత సాధారణ ధరతో, కాంపాక్ట్ ఇంకా వైబ్రేషన్స్ రిసిస్టంట్ కలిగి ఉంటుంది.సోనీ కంపెనీ ఆటొనోమస్ వాహన టెక్, వాహన భాగాల బిజినెస్ అనేది ఒక కాలిక్యులేటివ్ మూడ్.

జపాన్ కంపెనీ ఇప్పటికే ఇమేజ్ సెన్సార్ వ్యాపారంలో అగ్రగామిగా ఉంది. కార్ల తయారీదారులకు ప్యాకే గా లిడార్లు, ఇమేజ్ సెన్సార్లను సరఫరా చేయడం ద్వారా ఆటొనోమస్ వాహన మార్కెట్లో దీనిని పెద్ద మార్పుగా మార్చాలని సోనీ భావిస్తోంది. వాస్తవానికి, సోనీ ఇప్పటికే టెస్లా వంటి పెద్ద కార్ల తయారీదారులతో తన లిడార్లు, ఇమేజ్ సెన్సార్లను ఆటొనోమస్ వాహనాలను నిర్మించడానికి చర్చలు జరుపుతోంది.

click me!