CES 2020: హోండా నుండి ఆగ్మెంటెడ్ డ్రైవింగ్ కాన్సెప్ట్‌ కార్

By Sandra Ashok Kumar  |  First Published Jan 8, 2020, 2:26 PM IST

హోండా కంపెనీ ప్రకారం, కారు డ్రైవింగ్ నుండి విముక్తి పొందినప్పుడు వారు కొత్త మార్గాల్లో ఆటొనోమస్ మొబిలిటీ డ్రైవింగ్ ఆస్వాదించగలుగుతారు.హోండా కంపెనీ ప్రకారం, డ్రైవింగ్ నుండి నుండి విముక్తి పొందినప్పుడు వవాహనదారులు కొత్త మార్గాల్లో ఆటొనోమస్ మొబిలిటీని ఆస్వాదించగలుగుతారు.


కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2020 లో ఈ సంవత్సరం చాలా మంది ఆటోమొబైల్ తయారీదారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆటొనోమస్ వాహనాలకు కల్చర్ ట్రాన్సిషన్ కోసం హోండా తన ఆగ్మెంటెడ్ డ్రైవింగ్ కాన్సెప్ట్‌ కారును ప్రవేశపెట్టింది. హోండా కంపెనీ ప్రకారం, డ్రైవింగ్ నుండి నుండి విముక్తి పొందినప్పుడు వినియోగదారులు కొత్త మార్గాల్లో ఆటొనోమస్ మొబిలిటీని ఆస్వాదించగలుగుతారు.

also read  అద్భుతమైన ఫీచర్లతో హ్యుండాయ్ లేటెస్ట్ మోడల్ కార్....

Latest Videos

undefined

ఆగ్మెంటెడ్ డ్రైవింగ్ కాన్సెప్ట్‌లో హోండా అటానమస్ నుండి సెమీ అటానమస్ డ్రైవింగ్ ఆపరేషన్‌ అందించింది. కార్ నడిపేకారు త్వరగా స్పందించడానికి, అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్ నిరంతరం స్టాండ్‌బైలో ఉంటుంది. అవసరమైనప్పుడు వాహనాన్ని మధ్యలో నడపడానికి లేదా కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. డ్రైవింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ ఇంకా మాన్యువల్ మోడ్ మధ్య స్విచ్‌తో మారుతుంది.

పూర్తి అటానమస్ అలాగే సెమీ అటానమస్ ఆపరేషన్ మధ్య ఎనిమిది కంటే ఎక్కువ మోడ్‌లను ఈ కారులో కలిగి ఉంటుంది.వాహనంలో వివిధ సెన్సార్లు ఉన్నాయి. ఇవి ఈ మోడ్‌ల మధ్య సజావుగా మారాలనుకుంటే కారు డ్రైవింగ్ చేసేటప్పుడు వారి మైండ్ సెట్ ని నిరంతరం చదువుతాయి. ఇది సహజమైన డ్రైవింగ్ అనుభవాన్ని సృష్టిస్తుంది.

also read అవతార్ సినిమా స్ఫూర్తితో ‘బెంజ్’ కార్... జేమ్స్ కేమరూన్​ సాయంతో ఆవిష్కరణ...

దాని రి డిజైన్ చేసిన స్టీరింగ్ వీల్‌తో, హోండా ఆగ్మెంటెడ్ డ్రైవింగ్ కాన్సెప్ట్ కొత్త రకం డ్రైవింగ్ అనుభవాలను అందిస్తుంది. స్టీరింగ్ వీల్‌ను రెండుసార్లు ప్యాట్ చేయడం ద్వారా వాహనం ప్రారంభమవుతుంది. స్టీరింగ్ వీల్ లాగితే  వాహనం స్లో అవుతుంది. స్టీరింగ్ వీల్ నెట్టితే  వాహనం వేగవంతం అవుతుంది. ఇంకా ఇలాంటి అత్యాధునికమైన ఫీచర్స్ చాలా ఉన్నాయి.
 

click me!