భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను లాంచ్ సోనాలిక.. ధర, మైలేజ్ తెలుసా..

Ashok Kumar   | Asianet News
Published : Dec 24, 2020, 04:53 PM IST
భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను లాంచ్ సోనాలిక.. ధర, మైలేజ్ తెలుసా..

సారాంశం

ఈ కొత్త ట్రాక్టర్‌కు టైగర్ ఎలక్ట్రిక్ అని పేరు పెట్టింది, సోనాలికా ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌లో 11 కిలోవాట్ల ఇండక్షన్ మోటారు, 25.5 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు, వీటిని రెగ్యులర్ హోమ్ ఛార్జింగ్ సాకెట్ ఉపయోగించి 10 గంటల్లో లేదా  ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

ముంబయి: ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని సోనాలికా ట్రాక్టర్స్ దేశీయ మార్కెట్ కోసం ఫీల్డ్-రెడీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను వాణిజ్యపరంగా లాంచ్ చేసి మొదటి తయారీ సంస్థగా నిలిచింది. ఈ ట్రాక్టర్‌ పరిచయ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ గరిష్ట వేగం గంటకు 24.93 కి.మీ.

ఈ కొత్త ట్రాక్టర్‌కు టైగర్ ఎలక్ట్రిక్ అని పేరు పెట్టింది, సోనాలికా ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌లో 11 కిలోవాట్ల ఇండక్షన్ మోటారు, 25.5 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు, వీటిని రెగ్యులర్ హోమ్ ఛార్జింగ్ సాకెట్ ఉపయోగించి 10 గంటల్లో లేదా  ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

 టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ ఒకే ఛార్జీతో 2-టన్నుల లోడ్ తో 8 గంటలు నడుస్తుందని కంపెనీ తెలిపింది. మూడేళ్ల క్రితం ఎస్కార్ట్స్ లిమిటెడ్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది. అయితే దీనిని కొన్ని అభివృద్ధి చెందిన మార్కెట్లకు ఎగుమతి చేసింది, కాని భారతదేశంలో లాంచ్ చేయలేదు.

also read వచ్చే ఏడాది జనవరి 2021 నుండి నిస్సాన్ & డాట్సన్ కార్ల ధరల పెంపు.. ఏ కారుపై ఎంతంటే ? ...

"మా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ (లు) ఐరోపాలో రూపొందించబడ్డాయి. నిరంతర శక్తిని, ఉద్గార రహిత, శబ్దం లేని వ్యవసాయాన్ని అందించడానికి  దేశీయంగా అభివృద్ధి చేయబడ్డాయి" అని కంపెనీ తెలిపింది. టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రైతులకు మెరుగైన సౌకర్యాన్ని ఇస్తుంది, ఎందుకంటే ఇంజన్ నుండి వేడి బదిలీ చేయదు.

హోషియార్‌పూర్‌కు చెందిన సంస్థ పెద్ద మోడళ్లతో సహా పలు ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను అభివృద్ధి చేసిందని, త్వరలో వాటిని వాణిజ్యపరంగా విడుదల చేసే ప్రణాళికలో ఉందని చెప్పారు.

టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ పనితీరు సాధారణ ట్రాక్టర్ వలె ఉంటుంది, ఇంధన ఖర్చులను తగ్గించుకుంటూ రైతుకు అనుకూలంగా ఉంటాయి "అని సోనాలికా ట్రాక్టర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ అన్నారు.

ట్రాక్టర్ల డిమాండ్‌పై మిట్టల్ ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇండస్ట్రి పరంగా 13% వృద్ధిని, ట్రాక్టర్ అమ్మకాలలో 33% వృద్ధిని నమోదు చేసింది.

PREV
click me!

Recommended Stories

Kia Seltos 2026 : కేక పుట్టిస్తున్న కొత్త కియా సెల్టోస్.. డిజైన్, ఫీచర్లు అదరహో !
Renault Duster: ఐకాన్ ఇజ్ బ్యాక్‌.. అదిరిపోయే అప్డేట్స్‌తో డ‌స్ట‌ర్ దూసుకొస్తోంది