2017లోనే కంపెనీని అమ్మివేయాలని అనుకున్న.. కానీ వారు దానికి నిరాకరించారు: టెస్లా సీఈవో

By S Ashok Kumar  |  First Published Dec 23, 2020, 2:37 PM IST

కొన్నేళ్ళ క్రితం టెస్లా ఇంక్‌ నిధుల లభ్యతతో సతమతమవుతున్న సమయంలో కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ టెస్లా ఇంక్‌ను అమ్మివేసేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని టెస్లా ఇంక్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ ద్వారా వెల్లడించినట్లు ఒక మీడియా సంస్థ పేర్కొంది. 


న్యూ ఢీల్లీ: ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్‌ లో పదవ వంతును 2017లో ఆపిల్‌ సంస్థకు విక్రయించడానికి టిమ్ కుక్ ని సంప్రదించినట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు.  కొన్నేళ్ళ క్రితం టెస్లా ఇంక్‌ నిధుల లభ్యతతో సతమతమవుతున్న సమయంలో కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ టెస్లా ఇంక్‌ను అమ్మివేసేందుకు సిద్ధపడ్డారు.

ఈ విషయాన్ని టెస్లా ఇంక్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ ద్వారా వెల్లడించినట్లు ఒక మీడియా సంస్థ పేర్కొంది. అయితే కంపెనీ అమ్మకం కోసం అప్పుడు టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ను సంప్రదించినట్లు ఎలన్‌ మస్క్ తెలిపారు. 

Latest Videos

దీనిపై  సమావేశమయ్యేందుకు యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ నిరాకరించారు ”అని మస్క్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. అతని ట్వీట్‌పై ఆపిల్ ఇంకా స్పందించలేదు. 2024లో ఆపిల్ మొట్టమొదటి ఎలక్ట్రిక్, అటానమస్ కారును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు నివేదికలు రావడంతో ఎలాన్ మస్క్ ట్వీట్ కు  ప్రాధాన్యత ఏర్పడినట్లు కొందరు విశ్లేషకులు  భావిస్తున్నారు.

also read ఇండియాకి జనరల్ మోటార్స్ బై బై.. భారతదేశంలోని చివరి కర్మాగారం మూసివేత.. ...

మస్క్ 2018లో మీడియా ఇంటర్వ్యూలో "అతను సిఇఒగా బాధ్యతలు స్వీకరించిన సంవత్సరంలోలో కంపెనీ దాదాపు దివాళా తీసిందని, ఆ సమయంలో టెస్లా విజయవంతం కావడానికి 10% కన్నా తక్కువ అవకాశలు ఉన్నాయని చెప్పాడు.

మోడల్‌-3 ఎలక్ట్రిక్‌ కార్ల అభివృద్ధి సమయంలో ఎదురైన ఆర్థిక సమస్యలతో టెస్లాను విక్రయించాలని అనుకున్నట్లు ఎలాన్ మస్క్‌ పేర్కొన్నారు. ఇందుకు టిమ్‌ కుక్‌ను సంప్రదించినప్పటికీ తనతో సమావేశమయ్యేందుకు అంగీకరించలేదని తెలియజేశారు.

కంపెనీ ప్రస్తుత విలువలో పదోవంతును యాపిల్‌కు విక్రయించాలని భావించినట్లు వెల్లడించారు. మరోవైపు, ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను అధిగమించి ప్రపంచంలోని రెండవ ధనవంతుడు అయ్యాడు.

గత నెలలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఎలాన్ మాస్క్ బిల్ గేట్స్  127.7 బిలియన్ డాలర్ల కంటే 127.9 బిలియన్ డాలర్ల సంపదతో అధిగమించాడు. సెప్టెంబర్ 30తో ముగిసిన 2020 మూడవ త్రైమాసికంలో టెస్లా సంస్థ 145,000 వాహనాలను ఉత్పత్తి చేసి 139,300 డెలివరీలు చేసింది. కాలిఫోర్నియాలో  ఎక్కువ కాలం జీవితాన్ని గడిపిన తరువాత, ఎలాన్ మస్క్ చివరకు టెక్సాస్‌కు మకాం మార్చాడు. టెస్లా తన తదుపరి కర్మాగారాన్ని ఆస్టిన్‌లో నిర్మిస్తోంది.

click me!