వచ్చే ఏడాది జనవరి 2021 నుండి నిస్సాన్ & డాట్సన్ కార్ల ధరల పెంపు.. ఏ కారుపై ఎంతంటే ?

By S Ashok Kumar  |  First Published Dec 24, 2020, 11:00 AM IST

జనవరి 2021 నుండి అమలులోకి వచ్చే డాట్సన్, నిస్సాన్ బ్రాండ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు జపాన్ కార్ల తయారీ సంస్థ నేడు అధికారికంగా ప్రకటించింది. భారత మార్కెట్లో లభించే అన్ని మోడళ్ల కార్ల ధరలను 5 శాతం వరకు పెంచనున్నారు. 


ఆటో తయారీ  సంస్థలు ఇప్పటికే వచ్చే ఏడాది నుండి కార్ల ధరల పెరుగుదలను ప్రకటించారు. ఈ జాబితాలో తాజాగా మరో కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా చేరింది. జనవరి 2021 నుండి అమలులోకి వచ్చే డాట్సన్, నిస్సాన్ బ్రాండ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు జపాన్ కార్ల తయారీ సంస్థ నేడు అధికారికంగా ప్రకటించింది.

భారత మార్కెట్లో లభించే అన్ని మోడళ్ల కార్ల ధరలను 5 శాతం వరకు పెంచనున్నారు. ఇన్పుట్ ఖర్చులు పెరిగినందున ధరల పెంపు చేయాలని కంపెనీ నిర్ణయించింది.

Latest Videos

నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభించడంతో, నిస్సాన్ బ్రాండ్ క్రింద వినూత్నమైన, ఊత్తేజకరమైన ఉత్పత్తులను అందించే నిబద్ధతను పునరుద్ఘాటించింది.

also read 

భారతదేశంలోని వినియోగదారులకు నిస్సాన్ ఉత్తమ వాల్యు ప్రతిపాదనను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో పెరిగిన వ్యయాల కారణంగా అన్ని నిస్సాన్, డాట్సన్ మోడళ్ల ధరలను పెంచడానికి మేము నిర్ణయించాము. ప్రతిపాదిత ధరల పెరుగుదల జనవరి 2021 నుండి అమలులోకి వస్తుంది. " అని అన్నారు.

నిస్సాన్   1 జనవరి 2021 నుండి ఇటీవల విడుదల చేసిన మాగ్నైట్ ఎస్‌యూవీ ధరలను కూడా సవరించనుంది. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర ప్రస్తుతం 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్,).నిస్సాన్ మొట్టమొదటి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ దేశంలో అధికారికంగా ప్రారంభించిన కేవలం 15 రోజుల్లోనే 15,000 బుకింగ్‌లు సాధించింది. ఇది కాకుండా, ఈ ఎస్‌యూవీ కోసం 1,50,000కి పైగా ఎంక్వైరీ కూడా అందుకుంది.

మారుతి సుజుకి, బిఎమ్‌డబ్ల్యూ, ఇసుజు మోటార్స్, టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా, రెనాల్ట్, ఆడి, ఎంజి మోటార్ ఇండియా వంటి ఇతర కార్ల తయారీ సంస్థలు  ఇప్పటికే జనవరి 2021 నుండి ధరల పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

click me!