పుణె కేంద్రంగా పని చేస్తున్న మల్టీ బ్రాండ్ ఏజేపీ గ్రూప్ సంస్థ, షెల్ బై సంస్థతో కలిసి శక్తిమంతమైన మస్టాంగ్ కారును దేశీయ మార్కెట్లోకి తేనున్నది. డెట్రాయిట్ లో జరిగిన ఎక్స్ పోలో దీన్ని తొలుత ప్రదర్శించారు.
ఈ ఏడాదిలో మార్కెట్లోకి అతి శక్తిమంతమైన షెల్‌బై మస్టాంగ్ కారును ప్రవేశపెట్టనున్నట్లు పుణెకు చెందిన మల్టీ బ్రాండ్ ఎంటర్ ప్రైజైస్ ఏజేపీ గ్రూప్ ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థ స్కొమోడీ స్కూటర్స్, షెల్‌బైతో భాగస్వామిగా చేరింది.
ఈ కంపెనీ 2019లో డెట్రాయిట్‌లో జరిగిన ఆటోషోలో మస్టాంగ్ జీటీ500ను ప్రవేశపెట్టింది. దీన్ని 2019 చివర్లో భారత్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాకపోతే దీనిపై ఏ కంపెనీ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఈ సంస్థ ఇటీవలే మానస్ దేవన్‌ను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా నియమించింది.
షెల్‌బైకు భారత్‌కు చెందిన ఏజేపీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. కారులో మార్పులు చేర్పులు, అప్‌గ్రేడ్స్, ప్రపంచ స్థాయి విక్రయాలు, సర్వీసులు, వారెంటీ బైట్స్ వంటి వాటిని షైల్‌బై, ఫోర్డ్ ఇండియా సంయుక్తంగా చూసుకొంటాయి.
పూర్తిగా చేతితో చేసిన సూపర్ చార్జిడ్ 5.2 లీటర్ల సామర్థ్యం గల అల్యూమినియం అల్లాయ్ ఇంజిన్‌తోనాటె ఉంది. దీనికి 2.65 లీటర్ రూట్స్ టైప్ సూపర్ ఛార్జర్ ఉంది. ఇది 700 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.
దీంతోపాటు పలు రకాల డ్రైవింగ్‌లకు అవసరమైన మోడ్‌లు ఉన్నాయి. జనరల్, స్లిప్పరీ, స్పోర్ట్సీ, డ్రాగ్ అండ్ ట్రాక్ వంటి మోడ్‌ల్లో అందుబాటులో ఉంది. లైన్ లాక్, సెలెక్టబుల్ ట్రాక్ యాప్స్ ద్వారా ఆర్పీఎం సెలెక్టబుల్ లాంచ్ కంట్రోల్ అమర్చారు.
సూపర్ చార్జర్‌తోపాటు ఎయిర్ టు లిక్విడ్ ఇంటర్ కూలర్, వీ8 ఇంజిన్ నీట్‌గా సర్దుబాటు చేశారు. దీనికి తోడు షెల్ బై జీటీ 500 మోడల్ కారు 7 -స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్సిమిషన్ కలిగి ఉంటుంది. 100 మిల్లీ సెకన్లలోనే స్మూత్‌గా దూసుకెళ్తుంది.
చూడటానికి ఈ కారు షెల్ బై సిగ్నేచర్ మోడల్, ఫోర్డ్ మస్టాంగ్ డిజైన్‌తో మెర్జ్ అయినట్లు కనిపిస్తుంది. సెంట్రల్‌లో కోబ్రాతోపాటు లార్జ్ గ్రిల్లె, స్పోర్టీ ఫ్రంట్ బంపర్, లిప్ స్పాయిలర్, 20 అంగుళాల కార్బన్ ఫిబ్రే వీల్స్ ఉంటాయి.
0.5 అంగుళాల వైడర్ రేర్ వీల్స్ (11.5 అంగుళాలు), కస్టమ్ మిచైలిన్ పైలట్ స్పోర్ కప్ 2 టైర్స్, అడ్జస్టబుల్ ఎక్స్ పోజ్డ్ కార్బన్ ఫిబ్రే జీటీ 4 ట్రాక్ వింగ్, స్ప్లిట్టర్ వికర్స్, ఫ్రంట్ టూ సిగ్నేచర్ ట్విన్ రేసింగ్ స్ట్రిప్స్ అమర్చారు.