టాటా ‘జంట’ వ్యూహాలు: టిగోర్‌పై లక్ష వరకు రాయితీ

By Siva Kodati  |  First Published Mar 25, 2019, 11:18 AM IST

టాటా మోటార్స్ సెడాన్ మోడల్ కారు ‘టైగోర్’ సేల్స్ గతేడాదితో పోలిస్తే 40 శాతం పడిపోయాయి. మరోవైపు దాని సహచర మోడల్ టియాగో టాప్ 10లో వెళ్లి కూర్చుంది. దీంతో టాటా మోటార్స్ అధికారులు టైగోర్ విక్రయాలపై వినియోగదారులకు రూ. లక్ష వరకు రాయితీ కల్పిస్తున్నారు.
 


రెండు రోజుల క్రితం వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తమ కార్ల ధరలు పెంచేస్తున్నామని ప్రకటించింది టాటా మోటార్స్. తాజాగా ఆదివారం టాటా మోటార్స్ సంస్థ తాజా నూతన మోడల్ కార్లపై రాయితీలు కల్పిస్తోంది.

ఏడాది కాలంగా కొనుగోలుదారులను ఆకట్టుకోలేని హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘టిగోర్’పై రూ. లక్ష వరకు డిస్కౌంట్ అందజేస్తోంది. సెడాన్ మోడల్ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా డిజైన్ చేసిన ఈ కారు అటు స్టయిల్‌లోనూ, ఇటు ఫీచర్లు, ఇంజిన్, ఫ్లాట్‌ఫామ్‌లోనూ రూపొందించినా అమ్మకాలు మాత్రం భారీగా పడిపోయాయి.

Latest Videos

దీంతో రంగంలోకి దిగిన టాటా మోటార్స్ కంపెనీ ఉన్నతాధికారులు ఈ కారు విక్రయాలపై రూ. లక్ష వరకు రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించారు. జనవరిలో 2,361 యూనిట్లు అమ్ముడు పోగా, ఫిబ్రవరికి వచ్చేసరికి 1259 యూనిట్లకు పడిపోయాయి.

గతేడాది జనవరిలో 3,172 యూనిట్లు, ఫిబ్రవరిలో 2,846 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. అంటే జనవరి 26 శాతం, ఫిబ్రవరిలో 56 శాతం విక్రయాలు తగ్గాయి. ఈ కారు రూ.5.5 లక్షల నుంచి రూ.7.6 లక్షల మద్య వినియోగదారులకు అందుబాటులో ఉంది. 

టాటా టియాగో, టాటా టైగోర్ మోడల్ కార్లు ప్రాథమికంగా ఒకేలా ఉంటాయి. ఒకటి సెడాన్ అయితే మరొకటి హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు. స్టయిల్, ఫీచర్లు, ఇంజిన్లు అన్నీ ఒక్కటే కానీ సేల్స్ మాత్రం డిఫరెంట్‌గా ఉన్నాయి. 

టాటా టియాగో ‘టాప్ -10’ సేల్స్ కార్ల జాబితాలో చేరిపోయింది. టాటా టియాగో జనవరిలో 8041 (2018లో 8287), ఫిబ్రవరిలో 8,285 (2018లో 6,718) కార్లు అమ్ముడయ్యాయి. అంటే టాటా టియాగో సేల్స్ తొమ్మిది శాతం పెరిగాయి. 

టాటా టైగోర్ తక్కువ సేల్స్‌లో పోరాడుతోంది. కానీ దీనికి ఓ సమస్య ఉంది. టాటా టైగోర్ సెడాన్ మోడల్ కారుకు మారుతి సుజుకి ‘డిజైర్’ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. నెలవారీ మారుతి సేల్స్ సగటున 17 వేల కార్లు ఉంటాయి మరి.

టైగోర్‌తోపాటు హోండా అమేజ్, హ్యుండాయ్, వోక్స్ వ్యాగన్ అమెయో మోడల్ కార్లు కూడా పోటీ పడుతున్నాయి. హోండా అమేజ్ సేల్స్ సగటున ఏడువేలు ఉన్నాయి. మార్చి నెలాఖరు వరకు ఈ రాయితీ కొనసాగుతుందని చెబుతున్నారు. 

ఇటీవలే టాటా మోటార్స్ సంస్థ టైగోర్ మోడల్ కారుకు ఫేస్ లిఫ్ట్ ఇచ్చింది. కొన్ని కాస్మొటిక్ మార్పులు చేసింది. ఫ్రంట్ గ్రిల్లెకు డైమండ్ షేప్, డ్యుయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్రిస్టల్ ఇస్పైర్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఎల్ఈడీ హై మౌంటెడ్ స్టాప్ లాంప్ అమర్చారు. 

నూతన టాటా టైగోర్ మోడల్ కారులోపల న్యూ లెథర్ అప్ హోల్ స్టరీ, సేఫ్టీ ఫీచర్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్, ఏబీఎస్, ఈబీడీ ఏర్పాటు చేశారు.

హార్మాన్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, వీడియో ప్లే బ్యాక్ నుంచి టైగోర్ ఎక్స్ జడ్ ప్లస్ వేరియంట్ మోడల్ కారు ‘న్యూ7 ఇన్ఫోటైన్మెంట్’ వ్యవస్థను కూడా అందుకున్నది. 

click me!