టయోటా, జాగ్వార్ బాటలోనే: 1 నుంచి ‘టాటా’ కార్ల ధరలు పెంపు

By Siva Kodati  |  First Published Mar 24, 2019, 3:14 PM IST

టాటా మోటార్స్‌ ఏప్రిల్‌ నుంచి కార్ల ధరలను రూ.25,000 వరకు పెంచుతున్నట్లు  ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

టాటా మోటార్స్‌ ఏప్రిల్‌ నుంచి కార్ల ధరలను రూ.25,000 వరకు పెంచుతున్నట్లు  ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

వచ్చే నెల నుంచి తమ కార్లలో ఎంపిక చేసిన మోడల్ కార్ల రేట్లను పెంచుతున్నట్లు టయోటా, టాటా మోటార్స్ అనుంబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఇప్పటికే ప్రకటించాయి.

Latest Videos

టాటా మోటార్స్‌ ప్రస్తుతం చిన్న కారు నానో నుంచి ప్రీమియం ఎస్‌యూవీ హెక్సా వరకు పలు మోడళ్లు విక్రయిస్తోంది. వీటి ధర రూ.2.36 లక్షల నుంచి రూ.18.37 లక్షల స్థాయిలో ఉంది.ఆర్థిక పరిస్థితులు, ఇన్‌పుట్‌  వ్యయాల కారణం ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. 

మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాలు, వివిధ బాహ్య ఆర్థిక కారకాల కారణంగా ధరలను పెంచుతున్నామని  టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్  మయాంక్‌ పారిక్‌  ఒక ప్రకటనలో తెలిపారు.
 
click me!