నా తొలి కారు వెతికి పెట్టండి: సచిన్ విజ్ఞప్తి, అదేమిటో తెలుసా...

By Sandra Ashok KumarFirst Published Aug 19, 2020, 12:39 PM IST
Highlights

ముదిత్ డాని 'ఇన్ ది స్పోర్ట్‌లైట్' షోలో ప్రత్యేక ఎపిసోడ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మాట్లాడుతూ తన వద్ద తన మొదటి కారు ఇప్పుడు తన వద్ద లేదని దానిని కొనుగోలు చేసిన వారు తనని సంప్రదించాలని మాస్టర్‌ విజ్ఞప్తి చేస్తున్నాడు.

భారత మాజీ క్రికెటర్, లెజెండరీ బ్యాట్స్ మాన్ సచిన్ టెండూల్కర్ ప్రొఫెషనల్ క్రికెటర్ అయిన తరువాత తన సొంత డబ్బుతో కొన్న తన మొదటి కారుతో చాలా మానసికంగా కనెక్ట్ అయ్యాడు.

ముదిత్ డాని 'ఇన్ ది స్పోర్ట్‌లైట్' షోలో ప్రత్యేక ఎపిసోడ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మాట్లాడుతూ తన వద్ద తన మొదటి కారు ఇప్పుడు తన వద్ద లేదని దానిని కొనుగోలు చేసిన వారు తనని సంప్రదించాలని మాస్టర్‌ విజ్ఞప్తి చేస్తున్నాడు.

మాజీ క్రికెటర్ కొన్ని సెంటిమెంట్ కారణాల వల్ల కారును తిరిగి పొందటానికి చాలా ఆసక్తిగా ఉన్నాట్లు తెలిపాడు. "నా మొదటి కారు మారుతి 800. దురదృష్టవశాత్తు, ఇది ప్రస్తుతం నాతో లేదు. దాన్ని తిరిగి పొందాటానికి నేను ఇష్టపడుతున్నను.

ప్రజలు నా మాట వింటున్నారు, కాబట్టి ఎవరి దగ్గరైన నా కారు ఉంటే నన్ను సంప్రదించడానికి సంకోచించకండి "అని సచిన్ ఈ కార్యక్రమంలో అన్నారు. సచిన్ కార్ల కలెక్షన్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. కార్ల పట్ల తన ఇష్టం చిన్న వయసులో నుంచే ఉంది.

also read 

"నా ఇంటికి సమీపంలో ఒక భారీ ఓపెన్ డ్రైవ్-ఇన్ మూవీ హాల్ ఉంది, అక్కడ ప్రజలు తమ కార్లను పార్క్ అందులో కూర్చొని సినిమా చూసేవారు, కాబట్టి నేను నా సోదరుడితో కలిసి ఆ కార్లను చూడటానికి గంటల తరబడి మా బాల్కనీలో నిలబడి చూస్తుండే వాడిని "అని సచిన్ అన్నారు.

"నేను డ్రెస్సింగ్ రూమ్ ముందు (బాల్ బాయ్ గా) నిలబడి ఉన్నాను, ఆటగాళ్ళు ఆటకు ఎలా సిద్ధమవుతారో నేను గమనించే వాడిని. తరువాత నా హీరో సునిల్ గవాస్కర్ ఒకసారి డ్రెస్సింగ్ రూమ్‌లోకి నన్ను ఆహ్వానించాను" అని సచిన్ గుర్తు చేసుకుంటూ చెప్పాడు. "అతను ఇప్పటికీ చివరి సీటుపై కూర్చున్నట్లు నాకు గుర్తుంది.

యాదృచ్చికంగా నేను రంజీ ట్రోఫీ క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు నేను కూడా అదే కుర్చీలో కూర్చున్నాను. నా క్రికెట్ హీరోతో సమానమైన స్థలాన్ని పంచుకోవడం అద్భుతం"అని మాస్టర్ బ్లాస్టర్ గుర్తు చేసుకున్నారు.

శివాజీ పార్క్ జిమ్‌ఖానాలో తాను గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ టెండూల్కర్ గడిచిన సంవత్సరాల్లో కూడా టేబుల్ టెన్నిస్ ఆడుతూ గంటలు తరబడి ఎలా గడిపాడో వెల్లడించాడు. తాను ఉదయం, సాయంత్రం క్రికెట్ సెషన్ల మధ్య వేసవి సెలవుల్లో ఐదు నుండి ఆరు గంటల వరకు టేబుల్ టెన్నిస్ ఆడేవాడని, క్రీడలో పాల్గొనడం తనకు చాలా ఇష్టమని చెప్పాడు.

click me!