క్లాసి స్పోర్టీ స్టైలిష్ లుక్ తో రెనాల్ట్ డస్టర్ టర్బో వచ్చేసింది.. ధర ఎంతంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Aug 17, 2020, 7:40 PM IST

కొత్త డస్టర్ ఎస్‌యూవీ మోడల్ ఇప్పుడు దేశంలో ఎస్‌యూవీ విభాగంలో అత్యంత శక్తివంతమైనది. కొత్త రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. 


 ఫ్రెంచ్ కార్ల తయారీదారు రెనాల్ట్  బి‌ఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రెనాల్ట్ డస్టర్ టర్బో మోడల్ ఎట్టకేలకు భారతదేశంలో విడుదల చేసింది. కొత్త డస్టర్ ఎస్‌యూవీ మోడల్ ఇప్పుడు దేశంలో ఎస్‌యూవీ విభాగంలో అత్యంత శక్తివంతమైనది. కొత్త రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది.

ఇందులో మూడు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో, ఎక్స్-ట్రోనిక్ సివిటి ఆప్షన్‌తో రెండు వేరియంట్లు ఉన్నాయి. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో రెనాల్ట్ డస్టర్‌ను ప్రారంభించడం భారతదేశంలో డస్టర్ కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిల్లాపల్లె అన్నారు.

Latest Videos

గత కొన్ని సంవత్సరాలుగా కార్ల ప్రియులు, భారతీయ కుటుంబాలు మా రెనాల్ట్ ఎస్‌యూవీతో బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాయి.  నాన్ స్టాప్ డ్రైవింగ్ అనుభవాన్ని ఆస్వాదించడానికి ధైర్యమైన, మరింత శక్తివంతమైన డస్టర్ తప్పనిసరిగా ఎక్కువ మందిని ప్రేరేపిస్తుంది. "


రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ వేరియంట్లు
 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఐదు వేరియంట్లలో వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మూడు అవి ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎస్, ఆర్ఎక్స్ జెడ్. సివిటితో ఉన్న మోడల్ ఆర్ఎక్స్ఎస్, ఆర్ఎక్స్జెడ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.


రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ ఫీచర్స్ 
కొత్త డస్టర్ ఎస్‌యూవీ మోడల్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 154 బిహెచ్‌పి శక్తిని, 1,600 ఆర్‌పిఎమ్ వద్ద 254 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ను, బిఎస్-6 1.3-లీటర్ ఇంజన్‌, మెరుగైన పనితీరు సామర్థ్యం కోసం గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ (జిడిఐ), డ్యూయల్ వేరియబుల్ వాల్వ్ టైమింగ్ (వివిటి) వంటి టెక్నాలజి యూనిట్ కలిగి ఉంది, ఇవి తక్కువ ఆర్‌పిఎమ్ వద్ద అధిక టార్క్, తక్కువ ఉద్గారాలను అందించడంలో సహాయపడతాయి.

also read 


రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ మైలేజ్ 
కొత్త రెనాల్ట్ డస్టర్ టర్బో మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో 16.5 కి.మీ మైలేజ్, సివిటి వెరీఎంట్  16.42 కి.మీ మైలేజ్ అందిస్తుందని పేర్కొంది.

రెనాల్ట్ డస్టర్ టర్బో ధర (ఎక్స్-షోరూమ్)
మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో బేస్ మోడల్ రెనాల్ట్ డస్టర్ టర్బో మోడల్  ధర 10.49 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్). సీవీటి వెర్షన్ ధర రూ.12.99 లక్షలతో ప్రారంభమవుతుంది. 1.5 లీటర్  పెట్రోల్ ఇంజన్ సామర్ధ్యంతో  లభిస్తున్న రెనాల్డ్ డస్టర్ ధరలు 8.59 లక్షల  నుంచి 9.99  లక్షల మధ్య ఉంటుంది.

click me!