తాజాగా పదవీ విరమణ ప్రకటన తరువాత ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ ధోని ఇంటికి వచ్చింది. అదేంటంటే రిస్టోర్ చేసిన పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఏఎం కారు. ఎంఎస్ ధోని భార్య సాక్షి సింగ్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఆ కారు ఫోటోలను, వీడియోను షేర్ చేశారు.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు, క్రికెట్ లో ఉన్న అద్భుతమైన శకాన్ని ముగించాడు. ఏదేమైనా ధోని తన కెరీర్ మూడ్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే తాజాగా పదవీ విరమణ ప్రకటన తరువాత ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ ధోని ఇంటికి వచ్చింది.
అదేంటంటే రిస్టోర్ చేసిన పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఏఎం కారు. ఎంఎస్ ధోని భార్య సాక్షి సింగ్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఆ కారు ఫోటోలను, వీడియోను షేర్ చేశారు. డ్యూయల్ రేసింగ్ స్టైప్స్, ప్రకాశవంతమైన ఎరుపు రంగులోని పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఏఎం కారు ధోని గ్యారేజీలో చేరింది.
పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఏఎం 1970లో నిర్మించిన ఒక అమెరికన్ కారు. ఇది భారతదేశంలో చాలా అరుదు. ఈ కారు 1971 నుండి 1973 మధ్య నిర్మించినట్లు కనిపిస్తుంది. ఈ కారు లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ వెర్షన్, వి8 బిగ్ బ్లాక్ 455 ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 325 బిహెచ్‌పిలను అభివృద్ధి చేసింది.
also read ప్యూర్ ఈవి నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కచార్జ్ తో 65 కి.మీ మైలేజ్.. ...
ఇంజన్ హర్స్ట్ షిఫ్టర్‌తో 4-స్పీడ్ మన్సీ ట్రాన్స్‌మిషన్ గేర్ అమర్చారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రెండు సీట్ డోర్ కారును క్రికెటర్‌కు డెలివరీ చేశారు, అయితే ధోని ప్రస్తుతం రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఛాంపియన్‌షిప్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోసం క్యాంప్ లో పాల్గొంటున్నాడు.
అయితే ఈ కారుకు ధోని ఎంత చెల్లించాడో తెలీదు, కాని బాగా రీడిజైన చేసిన కారు భారతదేశంలో వేలంలో 60 లక్షలకు పైగా ఉండోచ్చు. ట్రాన్స్ ఏఎం కారు కాకుండా వీడియోలో వివరంగా చూస్తే ధోని గ్యారేజీ లో ఉండే ఇతర కార్లు కనిపిస్తాయి. ఇందులో హమ్మర్ హెచ్ 2, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్‌తో పాటు రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో సిరీస్ 1 కూడా ఉన్నాయి.
మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్, పాత మోడల్ టయోటా కరోలాతో సహా కొన్ని ఇతర కార్లు కూడా ఉన్నాయి. ధోని గ్యారేజీలో ప్రత్యేకంగా రీడిజైన్ చేసిన నిస్సాన్ 4W73, ఫస్ట్ జనరేషన్ ఆడి క్యూ7, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2 మరెన్నో ఉన్నాయి. మహీంద్ర సింగ్ ధోని ఒక మంచి బైక్ లవర్ కూడా.
కాన్ఫెడరేట్ X132 హెల్కాట్, కవాసాకి నింజా హెచ్ 2, డుకాటీ 1098, యమహా ఆర్డి 350, రాయల్ ఎన్ ఫీల్డ్ మాచిస్మో, సుజుకి షోగన్, యమహా వైజెడ్ఎఫ్ 600 ఆర్, బిఎస్ఎ గోల్డ్‌స్టార్‌తో సహా హర్లే డేవిడ్సన్ ఐరన్ 883 తన బైక్ కాలేక్షన్ లో ఉన్నాయి. టీవీఎస్ బ్రాండ్ అంబాసిడర్ ధోని గత సంవత్సరం అపాచీ ఆర్ఆర్ 310ను మరియు ఇటీవల మహీంద్రా స్వరాజ్ ట్రాక్టర్‌ను తన గ్యారేజీలో చేరాయి.