మళ్ళీ పడిపోయిన వాహన అమ్మకాలు...కారణం బి‌ఎస్ 6...?

By Sandra Ashok Kumar  |  First Published Jan 10, 2020, 4:55 PM IST

ఆర్థిక వ్యవస్థలో తిరోగమన కారణంగా 2019 లో ఆటో అమ్మకాలు భారీ విజయాన్ని సాధించాయి. యుటిలిటీ వెహికల్ (యువి) విభాగంలో 2018 డిసెంబర్‌లో అమ్మిన 65,566 యూనిట్లతో పోలిస్తే ఇప్పుడు  85,252 యూనిట్లు అమ్ముడుపోయి 30.02 శాతం వృద్ధిని నమోదు చేసింది.


ప్యాసింజర్ వెహికల్స్ (పివి) విభాగంలో నవంబర్‌ ముందు నెలలలో వాహనాల అమ్మకాలలో  క్షీణతను నమోదు చేసుకున్నాయి. 2019 డిసెంబర్‌లో 1.24 శాతం క్షీణించి 235,786 యూనిట్ల అమ్ముడుపోయాయి. ఇది ఏడాది క్రితం అమ్మకాలతో  పోలిస్తే 238,753 యూనిట్లు నమోదైంది. యుటిలిటీ వెహికల్ (యువి) విభాగంలో 2018 డిసెంబర్‌లో 65,566 యూనిట్లు అమ్ముడుపోయాయి. కిందటి ఏడాదితో పోలిస్తే 85,252 యూనిట్ల అమ్మకాలు జరిగాయి, మొత్తంగ 30.02 శాతం వృద్ధిని నమోదు చేసింది.

also read తక్కువ ధరకే మార్కెట్లోకి మహీంద్రా ఎస్‌యూ‌వి ఎలక్ట్రిక్‌ కార్...

Latest Videos

undefined

ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 8.40 శాతం తగ్గాయి. ఏడాది క్రితం జరిగిన అమ్మకాలతో పోల్చితే  1,55,159 యూనిట్ల వద్ద నుండి 1,42,126 యూనిట్లకు చేరుకున్నాయి.  వ్యాన్స్ వాహనాల అమ్మకాలు 53.36 శాతం క్షీణించింది 2019 యేడాదిలో 8408 యూనిట్లను మాత్రమే అమ్మకాలు చేసింది అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 18,027 యూనిట్లు అమ్ముడుపోయాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలలో (సివి) 2019 డిసెంబర్‌లో 12.33 శాతం తగ్గి 66,622 యూనిట్ల వద్ద ఉండగా, ఏడాది క్రితం పోలిస్తే 75,984 యూనిట్లు అమ్ముడుపోయాయి.

 ఎంహెచ్‌సివి విభాగంలో గూడ్స్ క్యారియర్లు 42.93 శాతం క్షీణతను నమోదు చేసింది.  గూడ్స్ క్యారియర్ల అమ్మకాలో కిందటి ఏడాది 28,250 యూనిట్లు అమ్మకాలు చూడగా 2019లో 162.121 యూనిట్లను అమ్మకాలు చేసింది.కానీ ఎల్‌సివిలు, ఎంహెచ్‌సివి ప్యాసింజర్ క్యారియర్లు మంచి వృద్ధిని నమోదు చేశాయి.ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16.60 శాతం తగ్గాయి. 2019లో 10,50,038 యూనిట్ల వద్ద  అమ్మకాలు ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 12,59,007 యూనిట్లు అమ్ముడుపోయాయి.

ద్విచక్ర వాహనాలు, సివిల అమ్మకాలు తగ్గడం వల్ల జిడిపిలో తగ్గుదల, తలసరి ఆదాయంలో క్షీణతను చోటుచేసుకున్నాయి ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో. మొత్తం మీద ఆటో అమ్మకాలు 2019 డిసెంబరులో 13.08 శాతం క్షీణించి 14,05,776 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే నెలలో  పోలిస్తే 16,17,398 యూనిట్లు అమ్ముడుపోయాయి.

also read  ఒక్క నెలలోనే మార్కెట్లోకి 100కి పైగా వాహనాలు... టాటా మోటార్స్

2019లో దీర్ఘకాలిక మందగమనం కారణంగా వార్షిక అమ్మకాలపై నష్టాన్ని చూసింది. 2019లో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 12.75 శాతం తగ్గి జనవరి నుండి డిసెంబర్ వరకు 29,62,052 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది 2018లో 33,94,790 యూనిట్ల అమ్మకాలు నమోదు చేశాయి. సివిల అమ్మకాలు 2019లో 14.99 శాతం తగ్గి 8,54,759 యూనిట్లను అమ్ముడుపోయాయి.

2018లో 10,05,502 యూనిట్ల అమ్మకాలను జరిపింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 14.19 శాతం క్షీణించి 2019లో 18,568,280 యూనిట్లు, 2018లో 21,640,033 యూనిట్లు అమకాలు నమోదయ్యాయి.  2019లో వాహనాల మొత్తం అమ్మకాలు 13.77 శాతం తగ్గి 2,30,73,438 యూనిట్ల అమ్మకాలు జరపగ 2018లో మాత్రం 26,758,787 యూనిట్ల అమ్మకాలు   రికార్డు చేశాయి.
 

click me!