ఓల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ: కొత్తగా 2 వేల ఉద్యోగావకాలు

By Sandra Ashok KumarFirst Published Aug 26, 2020, 12:31 PM IST
Highlights

 ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భావిష్ అగర్వాల్ మంగళవారం ఉద్యోగులకు ఇచ్చిన ఇమెయిల్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను విభాగాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సాధించాలంటే రాబోయే 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ఇంజనీర్లతో, మరో 1,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపారు. 

ముంబయి: ఓలా క్యాబ్స్  చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ వాహనాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో తొలి ఉత్పత్తిని విడుదల చేయడానికి తమ బృందం కృషి చేస్తోందని ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు , సీఈఓ  భవీష్ అగర్వాల్ తెలిపారు.

ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 2 వేల మందిని నియమించుకోవాలని యోచిస్తోంది. ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భావిష్ అగర్వాల్ మంగళవారం ఉద్యోగులకు ఇచ్చిన ఇమెయిల్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను విభాగాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సాధించాలంటే రాబోయే 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ఇంజనీర్లతో, మరో 1,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని, గ్లోబల్ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తుల నిర్మించడం మా లక్ష్యం. దీని కోసం మేము త్వరలో అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించబోతున్నాము అని తెలిపారు.

also read   

ఓలా ఎలక్ట్రిక్‌ను గ్లోబల్ ఇంజనీరింగ్ సంస్థగా మార్చే లక్ష్యంతో సంస్థాగత పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తామని అగర్వాల్  పేర్కొన్నారు. కాగా ఈ ఏ డాది మే నెలలో అమెస్టర్‌డామ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ కంపెనీ ఎటెర్గో బీవీను ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (ఓఈఎం) కొనుగోలు చేసింది.  తద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లలో వినియోగించే అధిక శక్తి సాంద్రత కలిగిన బ్యాటరీ టెక్నాలజీకి ఓలా ఎలక్ట్రిక్  సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ యొక్క మొట్టమొదటి ఉత్పత్తిని త్వరలో ప్రారంభించటానికి తమ బృందం కృషి చేస్తోందని అగర్వాల్ చెప్పారు. కరోనావైరస్ వ్యాప్తి వ్యాప్తి చెందడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తరువాత షేర్డ్ మొబిలిటీ సేవలకు డిమాండ్ పడిపోవడంతో కంపెనీ మే నెలలో 1,400 మందిని తొలగించింది.

ఈ నెల ప్రారంభంలో, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను పెంచే ప్రయత్నంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మొత్తం వాహన ఖర్చులో 40% వాటా కలిగిన బ్యాటరీలు లేకుండా  ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి ఉత్తర్వులను జారీ చేసింది. దీని వల్ల బ్యాటరీ-స్వాప్ మోడల్‌ను స్వీకరించడాన్ని వేగవంతం చేస్తుందని, ఓలా ఎలక్ట్రిక్, సన్ మొబిలిటీ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
 

click me!