సోలార్ కార్ల తయారీకి ఆటో కంపెనీలకు కేంద్రం వరాలు..

By Sandra Ashok KumarFirst Published Aug 25, 2020, 6:43 PM IST
Highlights

కరోనా వైరస్ మహమ్మారి, చైనాతో కొనసాగుతున్న రాజకీయ వివాదాల మధ్య దేశంలో పూర్తిగా స్వయం సమృద్ధిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. 

న్యూ ఢీల్లీ :  ఇండియాలో సోలార్ కార్ల తయారీని ప్రోత్సహించెందుకు సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ మహమ్మారి, చైనాతో కొనసాగుతున్న రాజకీయ వివాదాల మధ్య దేశంలో పూర్తిగా స్వయం సమృద్ధిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సోలార్ కార్ల తయారీపై దృష్టి సారించింది. దేశంలో సోలార్ కార్ల తయారీని ప్రోత్సహించడానికి సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక

సోలార్ కార్ల తయారీపై ఇండియాను స్వావలంబనగా మార్చడానికి, దేశంలో సోలార్ కార్ల తయారీకి ఆటో కంపెనీలను ఆకర్షించడానికి మోడీ ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది.

also read 

ఈ ప్రణాళిక ప్రకారం దేశంలో సోలార్ కార్ల తయారీ కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపులు, రాయితీలు, తక్కువ వడ్డీకే రుణాలు, తక్కువ ధరకే భూమిని ఆటో కంపెనీలకు అందిస్తుంది. దీనితో పాటు, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.


ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ

సౌర కార్ల తయారీకి కృషి చేయడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, విద్యుత్-పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇలా చాలా మంది నిపుణులు ఉంటారు, వీరందరూ తమ సలహాలను ప్రధానమంత్రి కార్యాలయానికి ఇస్తారు.

దీని కింద దేశంలో సౌర కార్ల తయారీని ప్రోత్సహించే ప్రణాళికను రూపొందిస్తారు. ఈ ప్రణాళిక గురించి మోడీ ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. విశేషమేమిటంటే, 2021 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ప్రయాణీకుల వాహన మార్కెట్‌గా అవతరించనుంది.

 ప్రభుత్వం సౌర మార్కెట్ గురించి గొప్ప ఆశతో ఉన్నది. ప్రస్తుతం టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్, మహీంద్రా వంటి సంస్థలకు ఇప్పటికే దేశంలో సోలార్ ప్లాంట్లు ఉన్నాయి.

click me!