ఇండియాకి జనరల్ మోటార్స్ బై బై.. భారతదేశంలోని చివరి కర్మాగారం మూసివేత..

By S Ashok Kumar  |  First Published Dec 21, 2020, 7:03 PM IST

2017లో దేశీయ కార్యకలాపాలను నిలిపివేసిన తరువాత, జనరల్ మోటార్స్ ఇండియా భారతదేశంలో మిగిలి ఉన్న ఏకైక ప్లాంటులో కూడా కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది.
 


 న్యూ ఢీల్లీ: 1996లో భారతదేశంలో కార్ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి బ్రాండ్లలో ఒకటైన జనరల్ మోటార్స్ ఇండియాలో కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడానికి సిద్ధమవుతుంది. 2017లో దేశీయ కార్యకలాపాలను నిలిపివేసిన తరువాత, జనరల్ మోటార్స్ ఇండియా భారతదేశంలో మిగిలి ఉన్న ఏకైక ప్లాంటులో కూడా కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది.

క్రిస్‌మస్‌కు ఒక రోజు ముందు భారత్‌లోని చివరి ఫ్యాక్టరీ పూణేకు సమీపంలో ఉన్న తలేగావ్ ప్లాంట్‌ను సంస్థ మూసివేస్తున్నట్లు   నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఈ కార్ల తయారీ కర్మాగారాన్ని ఉపయోగిస్తున్నారు. నివేదిక ప్రకారం, తలేగావ్ ప్లాంట్ నుండి ప్రాధమికంగా  హ్యాచ్‌బ్యాక్ కార్లను  మెక్సికోకు ఎగుమతి చేస్తుంది.

Latest Videos

జనరల్ మోటార్స్ ఇప్పటికే దాని ఇతర భారతీయ కర్మాగారాన్ని 2017లో చైనా ఎస్‌ఏ‌ఐ‌సికి విక్రయించింది, దీనిని ఇప్పుడు ఎం‌జి మోటార్స్ ఉపయోగిస్తోంది. తలేగావ్ ప్లాంట్లో ప్రస్తుతం 1,800 మంది వేతన కార్మికులు  పనిచేస్తున్నారని తెలిపింది. వీరికి 2021 జనవరి వరకు జీతాలు ఇవ్వనున్నారు, అలాగే న్యాయ, పరిపాలనా సిబ్బంది సంస్థతో మార్చి 2021 వరకు ఉంటారు.

also read 

ఒక నివేదిక ప్రకారం భారతదేశం, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో జనరల్ మోటార్స్ మహారాష్ట్ర కర్మాగారాన్ని చైనా అతిపెద్ద ఎస్‌యూవీ తయారీ సంస్థ గ్రేట్ వాల్ మోటార్స్‌కు రూ.2,000 కోట్లకు విక్రయించనుంది, కాని భారతదేశం ఈ ఒప్పందాన్ని క్లియర్ చేయలేదు. జనవరిలో వారు బైండింగ్ టర్మ్ షీట్ మీద సంతకం చేసినప్పుడు ఈ ఒప్పందం ప్రకటించారు, ఇది ఈ సంవత్సరం రెండవ భాగంలో మూసివేయబడుతుంది.

అయితే ఏప్రిల్‌లో చైనాతో పాటు ఇతర పొరుగు దేశాల పెట్టుబడులకు భారత్‌ కఠినమైన నిబంధనలు విధించారు. లడఖ్‌లో 20 మంది భారతీయ సైనికులను హతమార్చిన తరువాత ఈ పరిస్థితి మరింత దిగజారింది, జనరల్ మోటార్స్-గ్రేట్ వాల్ తో సహ మరో రెండు ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గ్రేట్ వాల్ మోటార్స్ త్వరలో భారత మార్కెట్ కోసం ఎస్‌యూవీలను  విడుదల చేయలని ఎదురుచూస్తోంది.  

ఒక నివేదిక ప్రకారం షాప్ ఫ్లోర్ కార్మికులకు జనవరి 25 వరకు జీతం చెల్లించబడుతుందని  జనరల్ మోటార్స్ తెలిపింది. 

click me!